Free Bus:బస్సు టికెట్ ఛార్జీలను 15 శాతం పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ ఛార్జీల పెంపునకు ఆమోదించింది. ఇంధన ధరలు, సిబ్బందిపై వ్యయం వంటి నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ చెప్పారు.
Also Read: Ap Cm Chandra Babu Naidu: విశాఖ, విజయవాడలో మెట్రో రైళ్లు.. ఆ మార్గాల్లో అయితే డబుల్ డెక్కర్ నే
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ , కళ్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ , బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ రవాణా కార్పొరేషన్లలో బస్సు ఛార్జీలు 15శాతం మేర పెంచినట్లు అధికారులు ప్రకటించారు. " ఈ నాలుగు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్లలో పదేళ్ల క్రితం రోజువారీ డీజిల్ వినియోగం రూ.9.16కోట్లు వరకు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
Also Read: Syria:సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ కు సీరియస్..విష ప్రయోగం అని అనుమానం
ఇప్పుడు అది రూ.13.21 కోట్లకు పెరిగింది. ఇక సిబ్బందిపై రోజువారీ ఖర్చు రూ.12.95 కోట్లు నుంచి రూ.18.36 కోట్లు. అందుకే ఈ ఛార్జీ పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి హెచ్‌కే పాటిల్ చెప్పుకొచ్చారు. కర్ణాటకలో అమలువుతున్న ఫ్రీ బస్సు పథకం 'శక్తి' నాన్-లగ్జరీ బస్సుల్లో కొనసాగుతుందని పాటిల్ వివరించారు. రూ.2000 కోట్ల మేర ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను క్లియర్ చేసినట్లు తెలిపారు.
Also Read: Kumbh mela: మరికొన్ని రోజుల్లో మహా కుంభమేళా.. తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ట్రైన్స్
అయితే 13శాతం, 15శాతం ఛార్జీల పెంపు గురించి చర్చించామని, కానీ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో ఉన్న టికెట్ రేట్లను పరిశీలించి 15శాతం పెంచాలని ఫైనల్ చర్యలు జరుపుతామని అధికారులు చెప్పారు.
మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి!
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటనే సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర పైగా కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీరి స్ఫూర్తితో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 'మహాలక్ష్మి' పథకం ప్రవేశ పెట్టింది. ఏపీలోనూ ఈ ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: Pakistan: ప్రేమికురాలి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన యూపీ వాసి.. చివరికీ ఊహించని షాక్
ఈ పథకానికి సంబంధించి పలువురు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ఇటీవల కీలక చర్చంచిన విషయం తెలిసిందే. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాం ప్రసాద్‌రెడ్డి, ఉన్నతాధికారులు ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అంశంపై తీసుకుంటున్న చర్యలపై సీఎం అడిగారు.
ఈ విధానం అమల్లో ఉన్న కర్ణాటక, దిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తామని అధికారులు ప్రకటించారు. ఉగాది నాటికి పథకం అమల్లోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.