కాశ్మీర్‌లో సాంస్కృతిక వైభవాన్ని తిరిగి సాధిస్తామని అన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ది ఏజెస్ పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. కాశ్మీర్‌కి హిందూమతంలో ఋషి కశ్యపుడి పేరు పెట్టడం సాధ్యమేనని...ఆయన జన్మ భూమి అదేనని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అందుకే ఇప్పుడు సరైన విషయాలను ప్రజలకు అందించాలని అమిత్ షా అన్నారు.సిల్క్ రహదారి, మధ్య ఆసియా, శంకరాచార్య ఆలయం, హెమిస్ మఠం ఇలా అన్ని చోట్లా వాణిజ్యం నుంచి ఆధ్యాత్మికత వరకూ బలమైన పునాదులు కాశ్మీర్ సంస్కృతిలో ఉన్నాయని అమిత్ షా చెప్పుకొచ్చారు. Also Read: New Virus: చైనాలో మరో ప్రాణాంతక వైరస్..మళ్ళీ ముప్పు? 40 వేలమంది చనిపోయారు.. 370 ఆర్టికల్ కాశ్మీర్ యువతలో వేర్పాటు వాదాన్ని పెంచిందని అమిత్ షా అన్నారు. భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగం అవడానికి ఆర్టికల్ 370 అడ్డుపడ్డాయని అన్నారు. ఇప్పుడు 370 తో పాటూ 35ఏలను కూడా రద్దు చేశామని..కాశ్మీర్ ను భారత్‌లో కలపడాన్ని ఎవరూ ఆపలేరని అమిత్ షా అన్నారు. ఇక మీదట ఈ భూమిలో ఉగ్రవాదం పూర్తిగా నిర్మూలనం అవుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదం కారణంగా ఇప్పటి వరకూ 40 వేలమంది చనిపోయారని అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్ అభివృద్ధి ప్రధాని మోదీ వల్లనే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. Also Read: Ap Cm Chandra Babu Naidu: విశాఖ, విజయవాడలో మెట్రో రైళ్లు.. ఆ మార్గాల్లో అయితే డబుల్ డెక్కర్ నే Also Read: Syria:సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ కు సీరియస్..విష ప్రయోగం అని అనుమానం