/rtv/media/media_files/2025/01/03/cXLF2f1WF2Tby4DyBehp.jpg)
CUTE 2025 EXAM
CUET PG: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్- పోస్ట్ గ్రాడ్యుయేట్ (CUET PG) ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ nta.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. CUET PG ప్రోగ్రామ్ లో మొత్తం 157 సబ్జెక్టులు ఉంటాయి. భారత దేశంలోని 27 రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా 312 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. నేటి నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పరీక్షలు 13 మార్చి 2025 నుంచి 31 మార్చి 2025 మధ్య నిర్వహించబడతాయి. పరీక్ష ఫీజు చెల్లించడానికి ఫిబ్రవరి 2 చివరి తేదీ. అలాగే అప్లికేషన్ లో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు చేసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: SSMB29: రికార్డులకు తెరలేపే కాంబినేషన్.. మహేశ్‌కు జోడీగా స్టార్ హీరోయిన్!
CUET PG 2025 పరీక్షా విధానం
CUET PG 2025 పరీక్ష కంప్యూటర్ పద్దతిలో ఉంటుంది. మొత్తం 100 MCQలు ఉంటాయి. 100 ప్రశ్నలకు 1 గంట 30 నిమిషాల టైం ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు ఇస్తే.. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు మైనస్ ఉంటుంది.
CUET PG FORM RELEASED 2025
— NIKHIL🌻 (@nextnikhilagain) January 3, 2025
Hey folks,
If anyone needs any help DM me!!
Happy to share my experience! pic.twitter.com/lbBiclzKLy
అప్లికేషన్ విధానం
- ముందుగా అధికారిక వెబ్‌సైట్, exams.nta.ac.in/CUET-PGని సందర్శించండి
- హోమ్‌పేజీలో, CUET PG 2025 లింక్‌ని గుర్తించి, దానిపై క్లిక్ చేయండి.
- కొత్త రిజిస్ట్రేషన్’పై క్లిక్ చేయండి . ఆ తరువాత ఒక ఒక విండో తెరవబడుతుంది. అక్కడ ఇచ్చిన అన్ని సూచనలను జాగ్రత్తగా చదవండి.
- ఆ ఫార్మ్ లో ఖచ్చితమైన వివరాలు, సరైన సమాచారాన్ని పూరించండి.
- దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. తర్వాత ఆ కాపీని ప్రింట్ తీసుకోండి.
- అప్లికేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: Gandhi TathaChettu: థియేటర్స్ లో సుకుమార్ కూతురు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్..!