కలిసి పనిచేద్దాం ఫ్రెండ్.. ట్రంప్‌కు మోదీ విషెస్!

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా, అమెరికాలకు ప్రయోజనాల కోసం మరోసారి నీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నానని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మైడియర్ ఫ్రెండ్ హిస్టారికల్‌ విజయాన్ని అభినందించారు.

author-image
By K Mohan
New Update
45236645456

45236645456 Photograph: (45236645456)

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన కొద్ది క్షణాల్లోనే మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ట్రంప్ రెండవ సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం చాలా విశేషమని మోదీ పేర్కొన్నారు.

ఇండియా, అమెరికాలకు ప్రయోజనాలు చేకురడానికి ప్రపంచానికి మంచి భవిష్యత్తును రూపొందించడానికి మరోసారి నీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నానని నరేంద్ర మోదీ ఎక్స్‌లో రాశారు. ప్రియమైన నా మిత్రుడి చారిత్రాత్మక ప్రామాణస్వీకారోత్సవానికి అభినందనలు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు