నిరసనకారులపై బురద చల్లిన ట్రంప్.. AIతో అమెరికా అధ్యక్షుడి వింత శేష్టలు

ట్రంప్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నో కింగ్స్ నిరసనలకు ఆయన తనదైన స్టైల్‌లో స్పందించాడు. ఈయన పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు టాప్ గన్ సినిమాలోని డేంజర్ జోన్ పాట యాడ్ చేశారు. 

New Update
Trump Ai video

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నో కింగ్స్ నిరసనలకు ఆయన తనదైన స్టైల్‌లో స్పందించాడు. ఈయన పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించిన వివాదాస్పద వీడియోలను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయడంతో ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. వలస విధానాలు, ఫెడరల్ గ్రాంట్ల తగ్గింపు, ఇతర నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేలాది మంది ప్రజలు వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, లాస్ ఏంజెలెస్‌తో సహా 50కి పైగా రాష్ట్రాల్లో నో కింగ్స్ పేరుతో భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ట్రంప్ 'రాజరికం' తరహా పాలనను అనుసరిస్తున్నారని నిరసనకారులు విమర్శించారు.

ఈ నిరసనలపై ట్రంప్ స్పందిస్తూ, "వారు నన్ను రాజు అని అంటున్నారు, కానీ నేను రాజుని కాదు" అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, కొద్ది గంటల తర్వాత, ఆయన తన సొంత సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో ఒక AI వీడియో పోస్ట్ చేశారు. సుమారు 20 సెకన్లు ఉన్న ఆ వీడియోలో, అధ్యక్షుడు ట్రంప్ కిరీటం ధరించి, "కింగ్ ట్రంప్" అని రాసి ఉన్న ఫైటర్ జెట్‌ను నడుపుతున్నట్లు కనిపిస్తుంది. ఆ జెట్ న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ వంటి ప్రదేశంలో నిరసనకారుల పైనుంచి వెళుతూ, వారిపై బురద చల్లుతుంది. ఈ వీడియోకు టాప్ గన్ సినిమాలోని డేంజర్ జోన్ పాట యాడ్ చేశారు. 

ఈ వీడియో పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు దీనిని అధ్యక్షుడి హోదాకు తగనిదిగా అభివర్ణించగా, మరికొందరు ట్రంప్ తన వ్యతిరేకులను ఎగతాళి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఏఐ టెక్నాలజీతో సృష్టించిన ఈ కంటెంట్, రాజకీయాల్లో నకిలీ (డీప్‌ఫేక్) వీడియోల వినియోగంపై మరోసారి ఆందోళనలను పెంచింది.

Advertisment
తాజా కథనాలు