BIG BREAKING : విషాదం.. ముగ్గురు జవాన్లు మృతి

లడఖ్‌లోని సియాచిన్ సెక్టార్‌లోని బేస్ క్యాంప్‌పై హిమపాతం విరిగిపడటంతో ముగ్గురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఆదివారం 12,000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ బేస్ క్యాంప్ ప్రాంతంలో హిమపాతం సంభవించింది.

New Update
soldiers

లడఖ్‌లోని సియాచిన్ సెక్టార్‌లోని బేస్ క్యాంప్‌పై హిమపాతం విరిగిపడటంతో ముగ్గురు ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం 12,000 అడుగుల ఎత్తులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అగ్నివీర్లతో సహా ముగ్గురు సైనికులు మంచు కింద చిక్కుకుపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి, వారి మృతదేహాలను వెలికితీశారు. ఒక ఆర్మీ కెప్టెన్‌ను సురక్షితంగా రక్షించారు. ఈ ప్రమాదంలో మరణించిన సైనికులు గుజరాత్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారు. వారు దాదాపు 5 గంటల పాటు మంచులో చిక్కుకుపోయినట్లు సమాచారం.  సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, అత్యంత ప్రమాదకరమైన యుద్ధభూమి.ఇక్కడ వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి.

Advertisment
తాజా కథనాలు