/rtv/media/media_files/2025/09/09/dk-2025-09-09-14-32-34.jpg)
కర్ణాటక(Karnataka) డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ 2025 లో ముఖ్యమంత్రి మార్పు అంశంపై ఆయన మరోసారి స్పందించారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందంటూ పరోక్ష సమాధానం ఇచ్చారు. ఆశ లేకపోతే.. జీవితమే లేదంటూ ఆయన కీలక కామెంట్స్ చేశారు. తాను సీఎం కావాలా వద్దా అనే ఈ నిర్ణయం పూర్తిగా కాంగ్రెస్ హైకమాండ్ , రాష్ట్రంలోని సమిష్టి నాయకత్వంపై ఉందని శివకుమార్ నొక్కి చెప్పారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక 2029 లో రాహుల్ గాంధీ భారతదేశానికి తదుపరి ప్రధానమంత్రి అవుతారని డికె శివకుమార్ వెల్లడించారు.
Also Read : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిరుపతి.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే!
DK Shivakumar confidently predicts Rahul Gandhi will be India’s next Prime Minister in 2029.
— VIZHPUNEET (@vizhpuneet) September 9, 2025
Ignore the media noise claiming otherwise; DKS remains firmly in Congress and committed to this vision.
The future belongs to Rahul Gandhi’s leadership.🔥🔥 pic.twitter.com/hOTdOHN5F6
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, సిద్ధరామయ్య(CM Siddaramaiah) ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్(DK Shivakumar) ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మొదటి నుండి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన డీకే శివకుమార్, సిద్ధరామయ్యకు ఐదేళ్ల పూర్తి కాలం ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలా లేదా పదవీ కాలాన్ని ఇద్దరి మధ్య పంచుకోవాలా అనే దానిపై అప్పట్లో చాలా చర్చలు జరిగాయి. ఆ తర్వాత, కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై మొదటి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాతి రెండున్నరేళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రులుగా ఉంటారని ఒక ఒప్పందం జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం అలాంటి ఒప్పందం ఏదీ లేదని స్పష్టం చేసింది.
ధర్మస్థల కేసుపై సంచలన వ్యాఖ్యలు
డీకే శివకుమార్ ధర్మస్థల కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు కేవలం ఒక బూటకం అని, ఇది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య అంతర్గత విభేదాల ఫలితమేనని పేర్కొన్నారు. ధర్మస్థల కేసు ఒక కుట్ర అని, ఆ పుణ్యక్షేత్రం ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ కుట్ర వెనుక బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ మధ్య అంతర్గత కలహాలే కారణమని స్పష్టం చేశారు. ఈ వివాదంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోదని, తాను ధర్మస్థల గురించి బాగా తెలుసుకున్నందున ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా చెప్పానని తెలిపారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఈ కేసులోని నిజాలను వెలికితీస్తుందని, ఇప్పటికే విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు. గతంలో, ధర్మస్థల క్షేత్రంలో మృతదేహాలను ఖననం చేశారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం దీనిపై సిట్ విచారణకు ఆదేశించింది. ఆరోపణలు చేసిన వ్యక్తిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో, బీజేపీ మరియు ఇతర హిందూ సంస్థలు దీనిని హిందూ దేవాలయాలను కించపరచడానికి జరుగుతున్న కుట్రగా అభివర్ణించాయి.
Also Read : మస్తు ట్విస్ట్.. భర్తతో గొడవ పడి నదిలో దూకిన భార్య.. కాపాడిన మొసలి..!