పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం తిరిగి ప్రారంభం కాగా మళ్లీ అదానీ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆయనపై అమెరికాలో నమోదైన కేసుల వ్యవహారంపై చర్చలు జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంలో ఉభయ సభల్లో అంతరాయం ఏర్పడింది. దీనిపై చర్చించాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీంతో లోక్‌సభ ప్రారంభమైన కాసేపటికే మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభను కూడా ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ 11.30 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత ఉభయ సభలు ప్రారంభమైనప్పటికీ మళ్లీ గందరగోళం నెలకొంది. పరిస్థితులు కంట్రోల్ కాకపోవడంతో సమావేశాలు మళ్లీ రేపటికి వాయిదా పడ్డాయి.
Also Read: సీఎంగా ఫడ్నవీస్.. షిండేకు కేంద్రమంత్రి పదవి !
పార్లమెంటు సమావేశాల్లో భాగంగా విపక్ష నేత రాహుల్ గాంధీ మీడియాతో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. కేవలం చిన్న ఆరోపణలు వస్తేనే ఎంతోమందిని అరెస్టు చేస్తున్నారని.. వేల కోట్ల రూపాయల స్కామ్ వ్యవహారంలో అదానీని జైల్లో పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం ఆయనను పదే పదే రక్షిస్తోందంటూ విమర్శలు గుప్పించారు.
మరోవైపు రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చింది. జార్జి సోరోస్ స్క్రిప్ట్ ఇక్కడ అమలు చేస్తున్నారని బదులిచ్చింది. ప్రముఖ బిలియనీర్ అయిన జార్జీ సోరోస్, రాక్‌ఫెల్లర్స్ బ్రదర్స్‌వంటి వారితో నడుస్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్.. పరిశోధనాత్మక కథనాలు అందిస్తుంటోంది. గతంలో కూడా అదానీ గ్రూప్‌పై ఓ సంచలన కథనం వెలువరించింది.
Also Read: బెంగళూరులో బెగ్గర్‌గా మారిన ఐటీ ఉద్యోగి.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో!
ఇదిలాఉండగా.. కేంద్ర సమాచారం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన సందేశాలను కట్టడి చేసే అంశంపై మాట్లాడారు. మన దేశ సంస్కృతికి, సామాజిక మాధ్యమ సంస్థలు చెందిన దేశాల సంస్కృతికి చాలా తేడా ఉందని అన్నారు. అందుకే ఈ సందేశాలకు సంబంధించిన అంశాన్ని స్టాండింగ్ కమిటీ పరిశీలించి, కఠినమైన చ్టటాలను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కోరుతున్నాని పేర్కొన్నారు.