Viral Video: బెంగళూరులో బెగ్గర్‌గా మారిన ఐటీ ఉద్యోగి.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో!

బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు బిచ్చగాడిగా మారాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో, తోడు ఎవరూ లేకపోవడంతో తాగుడికి బానిస అయ్యి రోడ్డు మీద భిక్షాటన చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

New Update
software begger

ఎవరి టైమ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఈ రోజున పేదవాడిగా ఉన్నవాడు రేపు ధనవంతుడు కావచ్చు. అదే విధంగా ఈ రోజు ధనవంతుడిగా ఉన్న వాడు రేపు పేదవాడిగా మారవచ్చు. ఒకే నిమిషంలో జీవితం మొత్తం మారిపోవచ్చు. ఇలాంటి ఘటనే బెంగళూరులో జరిగింది. గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌లో ఓ వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసేవాడు.

ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు

ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !

తాగుడికి బానిస కావడంతో..

తన తల్లిదండ్రులు చనిపోవడంతో పూర్తిగా తాగుడుకి బానిస అయ్యి అంతా కోల్పోయాడు. తాగుడికి బానిస కావడంతో ఉద్యోగం కూడా పోయింది. తన అనుకున్న వారు ఎవరూ కూడా లేరు. దీంతో బిచ్చగాడిగా మారిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు చాలా బాధ పడుతున్నారు. ఇంగ్లీషులో మాట్లాడుతున్న ఒక వెల్ ఎడ్యుకేడేట్ వ్యక్తి ఇలా బెగ్గర్‌గా మారిపోవడం చాలా బాధాకరమైందని కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: నెల్లూరు టీడీపీలో ఫైట్.. మంత్రి నారాయణ Vs ఎమ్మెల్యే కోటంరెడ్డి!

ఇది కూడా చూడండి: TG crime: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు