Manchu Vishnu: సుప్రీం కోర్టుకు హీరో మంచు విష్ణు! ఎందుకో తెలుసా

హీరో మంచు విష్ణు 2019 ఎలక్షన్ సమయంలో తనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కొట్టివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం జస్టిస్ బీ.వీ. నాగరత్న నేతృత్వంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

New Update
manchu vishnu about Prabhas

manchu vishnu approached supreme court

Manchu Vishnu: టాలీవుడ్ హీరో మంచు విష్ణు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2019 ఎన్నికల సమయంలో తనపై నమోదైన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసు కొట్టివేయాలని సుప్రీం కోర్టులో (Supreme Court)  పిటీషన్ దాఖలు చేశారు. ఈమేరకు దీనిపై  విచారణ జరిపిన న్యాయస్థానం  జస్టిస్ బీ.వీ. నాగరత్న నేతృత్వంలో ప్రతివాదనలకు  నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను జులై 15 కి వాయిదా  వేస్తున్నట్లు నిర్ణయించారు. అయితే 2019లో ఎన్నికల నియమాలను ఉల్లంఘించారని ఆరోపణలతో మంచు విష్ణుపై కేసు నమోదైంది.

Also Read: Mirai Telugu Teaser: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘మిరాయ్’ టీజర్.. వారెవ్వా అదిరిపోయింది మచ్చా

 హార్డ్ డ్రైవ్ దొంగతనం

ఇదిలా ఉంటే ప్రస్తుతం మంచు  విష్ణు ఫుల్ టెన్షన్ లో ఉన్నారు. ఆయన హీరోగా నటించిన  'కన్నప్ప'  మూవీ హార్డ్ డ్రైవ్ ని దొంగతనం జరిగింది. ఇందులో మూవీలోని vfx, గ్రాఫిక్స్ కి సంబంధించిన కీలక సన్నివేశాలు ఉండడంతో నిర్మాతలు, హీరో ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే నిర్మాతలు ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేస్తున్నారు. 

ఓవైపు  కన్నప్ప  సినిమా ప్రమోషన్స్‌తో  తీరిక లేకుండా గడుపుతున్న మంచు విష్ణుకు ఇదొక కొత్త తలనొప్పిగా మారింది. దీంతో మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఆ పరమ శివుడిని ప్రశ్నిస్తూ..  ‘జటాజూఠధారీ, నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?’.. హరహర మహాదేవ్’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 

latest-news | cinema-news | Supreme Court

Also Read: Pawan Kalyan OG Shooting: ఇదిరా పవర్ స్టార్ లుక్ అంటే.. ‘OG’ నుంచి కొత్త వీడియో అదిరిపోయిందెహే

Advertisment
Advertisment
తాజా కథనాలు