తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మహానాడు వేదికగా టీడీపీ నేతలు అధికారికంగా ప్రకటించారు. 1995లో చంద్రబాబు తొలిసారిగా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా 30 ఏళ్లుగా ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రతీ రెండేళ్లకు ఓసారి టీడీపీ అధ్యక్ష పదవికి పార్టీ అంతర్గత ఎన్నికల కమిటీ ఎన్నిక నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా మహానాడు వేదికగా నిర్వహించిన ఎన్నికలో.. జాతీయ అధ్యక్షుడు గా చంద్రబాబు ను 21 మంది సభ్యులు ప్రతిపాదించగా.. ఏకగ్రీవంగా ఆమోదించారు. చంద్రబాబుకు పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్రువీకరణ పత్రం అందించారు.
(ap cm chandrababu naidu | telugu-news | telugu breaking news)