Kargil Vijay Diwas 2025: పాకిస్థాన్‌ను చావుదెబ్బతీసి...జాతీయజెండాను రెపరెపలాండించి...

దేశ విభజన నాటి నుంచి భారతదేశంపై పాకిస్థాన్‌ కక్ష్య సాధిస్తూనే ఉంది. మనదేశ సరిహద్దుల వెంట ఉన్న వ్యూహాత్మక ప్రాంతాలపై దాడిచేసి దేశంపై పట్టుసాధించడానికి పాకిస్థాన్‌ కుతంత్రాన్ని తుత్తునీయలు చేసి మన జాతీయ పతకాన్ని రెపరెపలాడించిన రోజే కార్డిల్‌ విజయ్‌ దివాస్‌.

New Update
Kargil Vijay Diwas 2025

Kargil Vijay Diwas 2025

దేశ విభజన నాటి నుంచి భారతదేశంపై పాకిస్థాన్‌ కక్ష్య సాధిస్తూనే ఉంది. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనదేశంపై కుట్రలు చేస్తూనే ఉంది. మనదేశ సరిహద్దుల వెంట ఉన్న వ్యూహాత్మక ప్రాంతాలపై దాడిచేసి దేశంపై పట్టుసాధించడానికి పాకిస్థాన్‌ కుతంత్రాన్ని తుత్తునీయలు చేసి మన జాతీయ పతకాన్ని రెపరెపలాడించిన రోజే కార్డిల్‌ విజయ్‌ దివాస్‌. 1999లో జరిగిన ఈ యుద్ధంలో పాకిస్థాన్‌ ను మనదేశం చావుదెబ్బతీసింది. నాడు ఉగ్రవాదుల రూపంలో మనదేశంలోకి ప్రవేశించిన పాక్ సైనికులు దేశ సరిహద్దులను ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. ఆ కుట్రను ఇండియన్ ఆర్మీ.. ఆపరేషన్ విజయ్ పేరుతో.. తిప్పికొట్టింది.

స్వాతంత్ర్యం అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన అన్ని యుద్ధాల్లో కెల్లా చెప్పుకోదగింది కార్గిల్ యుద్ధం. ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాదు యావత్‌ దేశాన్నంతా ఒకే తాటిపైకి తెచ్చిన యుద్ధమిది. నాటి యుద్ధంలో భారత సైనికులు చూపించిన తెగువ, పోరాటపటిమ, వారి వీరత్వం గురించి నేటికి మనం గుర్తు చేసుకుంటున్నామంటే అది ఎంతటి మహాత్తర ఘట్టమో చెప్పుకోవాలి. కార్గిల్ యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా.. ఏటా జూలై 26 న కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నాం. 1971 తర్వాత భారత్-పాక్ మధ్య జరిగిన భారీ సైనిక పోరాటం ఇది. ఈ కార్గిల్ యుద్ధంలో...పాక్ పన్నాగాలను పసిగట్టడంలో భారత ఇంటెలిజెన్స్ సంస్థలు మొదట్లో విఫలం అయినా.. యుద్ధ క్షేత్రంలో మాత్రం.. సైనికులు భారత్ సత్తా చాటి పాక్‌కు గట్టి బుద్ది చెప్పారు.

Also Read :  హమాస్‌ చావాలనుకుంటుంది.. ఇజ్రాయెల్ పని పూర్తిచేయాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

GwuTi5BaoAATAsP

Also Read :  మృత్యువుతో పోరాడుతూ కాపాడండి అంటూ బీటెక్‌ విద్యార్థిని..

అసలేం జరిగిందంటే...

అది1999...భారత్ సరిహద్దుల్లో  వ్యూహాత్మక ప్రాంతమైన సియాసిన్‌.. మనదేశానికి అత్యంత కీలకమైన ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్‌ భారీ కుట్ర పన్నింది. లఢఖ్‌ప్రాంతంలో ఉన్న కార్గిల్ సెక్టార్‌లో పాకిస్తాన్ సైనికులు.. ఆ దేశ ఉగ్రవాద ముఠా ముజాహిదీన్ వేషంలో అత్యంత ఎత్తైన కొండ ప్రాంతాల్లోకి చొరబడ్డారు. భారతదేశంలోకి ఏ క్షణమైన ప్రవేశించి యుద్ధం చేయడానికి వీలుగా అక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే రెగ్యులర్‌గా గొర్రెలను కాసుకునే కొంతమంది కాపరులు దాన్ని గుర్తించారు. మొదట మనదేశ సైనికుల స్థావరాలుగా భావించినప్పటికీ అనుమానం వచ్చి ఆ సమాచారాన్ని భారత సైన్యానికి అందించారు. అప్రమత్తమైన ఇండియన్‌ ఆర్మీ అక్కడికి చేరుకుంది. మొదట వారిని ఉగ్రవాదులు అని భావించినప్పటికీ వారు ఉగ్రవాదుల వేషంలో ఉన్న పాకిస్తాన్ సైనికులు అని గుర్తించారు. 1999 మేలో  రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం జూలై 26 వ తేదీన ముగిసింది. ఉగ్రవాదులుగా అనుమానించి వారి కదలికలన గుర్తించడానికి వెళ్లిన ఐదుగురు సైనికులను పాక్‌ ఆర్మీ మొదట బలితీసుకుంది. ఆ తర్వాత వరుసగా ద్రాస్, కక్సర్, బటాలిక్, ముష్కో సెక్టార్లలోని వ్యూహాత్మక శిఖరాలను పాకిస్తాన్ ఆర్మీ ఆక్రమించింది.

Gwv6QLxaMAAg2U-

Also Read :  హైదరాబాద్ లో ఈ రోజు కరెంటు బంద్..

ఆఫరేషన్‌ విజయ్‌..

పాక్‌ సైనికుల తిరుగుబాటును తిప్పికొట్టడానికి  భారత్‌ ఆపరేషన్ విజయ్‌ మొదలుపెట్టింది. అయితే మొదట్లో భారత్‌ భారీగా ఎదురుదెబ్బలు తింది. పాకిస్తాన్ సైన్యం.. ఎత్తైన కొండలపైన ఉండడం.. భారత సైనికులు కింది నుంచి దాడి చేయడం వల్ల పట్టు సాధించలేకపోయారు. అనేక మంది మృత్యువాత పడ్డారు. వీటికితోడు సియాచిన్ ప్రాంతంలో మంచు, చలి వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకుని యుద్ధం చేయడం కష్టంగా మారింది. అయినా భారతీయ సైనికులు మొక్కవోని ధైర్యంతో పాక్‌ సైన్యాన్ని నిలువరించారు. ఎత్తైన ప్రాంతం నుంచి పాక్ చేస్తున్న దాడులను నిలువరించేందుకు భారత సైన్యం బోఫోర్స్ హోవిట్జర్లు (బోఫోర్స్ ఫిరంగులు) రంగంలోకి దింపింది. ఇవి ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న శత్రువుల బంకర్లపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేసి.. పాక్‌కు భారీ నష్టాన్ని కలిగించాయి. ఆ తర్వాత భారత వాయుసేన రంగంలోకి దిగింది. ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో శత్రు స్థావరాలపై వైమానిక దాడులకు దిగింది. కార్గిల్ అంటే ఎత్తైన భూభాగం, ఇరుకైన లోయలు, పాకిస్తాన్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ దాడులు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు పెను సవాళ్లను విసిరాయి. దాని పైలట్ నచికేతను పాకిస్తాన్ యుద్ధ ఖైదీగా బంధించింది. ఇక మరో మిగ్-21 యుద్ధ విమానాన్ని పాక్ దళాలు కూల్చివేయడంతో దాని పైలట్ అజయ్ అహూజా అమరుడయ్యాడు. పాకిస్తాన్ సైన్యం ఆక్రమించిన టోలోలింగ్ శిఖరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని.. కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ తొలి విజయాన్ని దక్కించుకుంది.  ఆ తర్వాత టైగర్ హిల్, బాటలిక్ సెక్టార్‌లోని పాయింట్ 4875 వంటి కీలక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో వారు విజయం సాధించారు. ఈ యుద్ధంలో దాదాపు 527 మంది భారత సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారు, వారి ధైర్యం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినది.

mygov-9999999991629896620-1024x534

Also Read :  ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన

అంతర్జాతీయ ఒత్తిడి...

ఒకవైపు పాక్ సైన్యాన్ని తరిమికొడుతూనే భారత్.. మరోవైపు.. అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావడంలో విజయం సాధించింది. భారత్ దౌత్యంతో పాకిస్తాన్ చొరబాట్లను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. సరిహద్దుల్లో సైన్యాన్ని బేషరతుగా వెనక్కి రప్పించాలని.. అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఒకవైపు అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడితోపాటు.. భారత సైన్యం చేస్తున్న దాడులను తట్టుకోలేకపోయిన పాక్ సైన్యం.. వెనక్కి తిరిగి పారిపోయింది.భారత్ దెబ్బకు పాకిస్తాన్ సైన్యం పారిపోవడంతో 1999 జూలై 14వ తేదీన ఆపరేషన్ విజయ్ సక్సెస్ అయిందని ఇండియన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. ఇక చిట్టచివరి పాక్ సైనికుడిని భారత గడ్డపై నుంచి తరిమికొట్టిన తర్వాత.. జూలై 26వ తేదీన కార్గిల్ యుద్ధం ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు.  అధికారిక గణాంకాల ప్రకారం.. 527 మంది సైనికులు అమరులయ్యారు. 1,363 మంది జవాన్లు గాయపడ్డారు. పైలట్ నచికేతను యుద్ధఖైదీగా పట్టుకున్న పాకిస్తాన్ ఆ తర్వాత విడుదల చేసింది.

ఈ విజయం కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, భారతీయుల ఐక్యత, దేశం పట్ల నిబద్ధతకు ఒక చిహ్నం. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులు, వారి కుటుంబాలు, వారి త్యాగాలు భారతదేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ రోజు, ప్రతి భారతీయుడు తన హృదయంలో గర్వంతో, అమర జవాన్లకు నీరాజనం అర్పిస్తూ, దేశ రక్షణలో తమ పాత్రను గుర్తు చేసుకోవాలి.

India Pakistan War Tensions | india pakistan war live | india pakistan war date | india pakistan war alert | india pakistan war | india | kargil-war | vijay-diwas

Advertisment
తాజా కథనాలు