Pakistan PM: మరోసారి భారత్‌పై విషం కక్కిన పాక్ ప్రధాని.. 12 మంది చావుకు కారణం వారే!

పాక్ రాజధాని ఇస్లామాబాద్‌‌లో మంగళవారం బ్లాస్ట్ జరిగింది. ఈ దాడికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎటువంటి ఆధారాలు లేకుండానే భారతదేశంపై నింద మోపారు. జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయి, 20 మందికి పైగా గాయపడ్డారు.

New Update
Pakistan PM

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌(islamabad blast today) లో మంగళవారం (నవంబర్ 11)న బ్లాస్ట్ జరిగింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్(Pakistan PM Shabaz Sharif) ఎటువంటి ఆధారాలు లేకుండానే భారతదేశంపై నింద మోపారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం జ్యుడీషియల్ కాంప్లెక్స్ వెలుపల జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయి, 20 మందికి పైగా గాయపడ్డారు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో కోర్టు గేటు సమీపంలో ఆగి ఉన్న కారులో ఈ పేలుడు సంభవించింది. ఇది అత్యంత రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది.

Also Read :  అదృష్టం కలిసొచ్చి.. ఆరేళ్ల తర్వాత రూ.కోటిగా నడిసొచ్చింది

Pakistan PM To Blame India

మృతుల్లో అత్యధికులు న్యాయవాదులు, సాధారణ పౌరులు ఉన్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. భద్రతా అధికారులు దీనిని ఆత్మాహుతి దాడిగా నిర్ధారించారు. అటు ఈ దాడికి ఒకరోజు ముందు ఢిల్లీ బ్లాస్ట్‌‌లో 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ వెనుక పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతుండగా.. పాక్‌ తిరిగి భారత్‌పైనే నిందలు వేస్తోంది.

ఈ దుర్ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఆత్మాహుతి దాడి వెనుక భారతదేశం హస్తం ఉందని, భారత మద్దతు ఉన్న శక్తులు ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. సోమవారం వానాలోని ఆర్మీ కళాశాలపై జరిగిన దాడిలో కూడా భారత్‌కు పరోక్ష పాత్ర ఉందని, ఆఫ్ఘన్ తాలిబాన్ భారత్‌కు ప్రాక్సీగా పనిచేస్తోందని షరీఫ్ విమర్శించారు.

పాకిస్తాన్ అంతర్గత భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై ఎటువంటి ప్రాథమిక దర్యాప్తు లేకుండానే, ఇస్లామాబాద్ నేరుగా పొరుగుదేశమైన భారత్‌ను నిందించడం అంతర్జాతీయంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కాగా, ఈ దాడికి తామే బాధ్యులమని నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ప్రకటించింది. అయినప్పటికీ, పాక్ ప్రధాని ఈ ఆరోపణలను భారత్ వైపు మళ్లించడం గమనార్హం. ఈ ఆరోపణలను భారతదేశం ఇంకా అధికారికంగా ఖండించనప్పటికీ, ఇది పాక్ రాజకీయాల్లో అంతర్గత సమస్యలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read :  మరో భారీ భూకంపం.. 6.1 తీవ్రతతో నమోదు

Advertisment
తాజా కథనాలు