US Woman: అదృష్టం కలిసొచ్చి.. ఆరేళ్ల తర్వాత రూ.కోటిగా నడిసొచ్చింది

అమెరికాలో ఉత్తర కరోలినాలోని హోప్ మిల్స్‌కు చెందిన బార్బరా సుమారు 6 సంవత్సరాల క్రితం కొన్ని లాటరీ నంబర్లను ఎంచుకున్నారు. ఇటీవల జరిగిన డ్రాలో, లాకీ స్టాప్ అనే స్టోర్ నుండి ఆమె కొనుగోలు చేసిన కేవలం $1 టికెట్‌కు అక్షరాలా $1,54,168 గ్రాండ్ ప్రైజ్ దక్కింది.

New Update
US Woman Win

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. కానీ, ఒకే నంబర్లను నమ్ముకుని, ఆరేళ్ల పాటు పట్టుదలతో ఆడిన ఓ అమెరికన్ మహిళకు కోటి రూపాయలకు పైగా విలువైన జాక్‌పాట్(1 crore Winner) తగిలింది. ఉత్తర కరోలినాలోని హోప్ మిల్స్‌కు చెందిన బార్బరా మున్‌ఫోర్డ్ ఈ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. బార్బరా సుమారు ఆరు సంవత్సరాల క్రితం కొన్ని ప్రత్యేకమైన లాటరీ నంబర్లను కొన్నారు. అప్పటి నుంచి ప్రతిసారీ ఆమె నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీలోని క్యాష్ 5 డ్రాలో ఆ నంబర్లనే కొంటూ వచ్చారు. ఈ నంబర్లపై లాటరీ తీసుకోవాలని తన సోదరి ప్రోత్సహించారని, ఒక రోజు ఖచ్చితంగా గెలుస్తావని ఆమె చెప్పేవారని బార్బరా గుర్తు చేసుకున్నారు.

Also Read :   పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. స్పాట్‌లో ఆరుగురు..

US Woman Wins Lottery

సోదరి చెప్పినట్టే బార్బరా పట్టుదల ఫలించింది. ఇటీవల జరిగిన డ్రాలో, లాకీ స్టాప్ అనే స్టోర్ నుండి ఆమె కొనుగోలు చేసిన కేవలం $1 టికెట్‌కు అక్షరాలా $1,54,168 (భారత కరెన్సీలో సుమారు రూ. 1.28 కోట్లు) గ్రాండ్ ప్రైజ్ దక్కింది. విజేత నంబర్లను తనిఖీ చేసుకుంటున్నప్పుడు, "ఓ మై గాడ్, నేనే! నేనే గెలిచాను!" అని ఆమె ఆశ్చర్యంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఈ అనూహ్య విజయం తన జీవితాన్ని మార్చివేసిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా ఒకే నంబర్లను నమ్మినందుకు, ఇప్పుడు భారీ మొత్తం బహుమతిగా రావడంతో, పట్టుదల, విశ్వాసమే ఈ విజయానికి కారణమని బార్బరా అన్నారు. ఈ డబ్బుతో ఏమి చేయాలనే దానిపై ఆమె ఇంకా ఎటువంటి పెద్ద ప్రణాళికలు వేయలేదు కానీ, జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా గడుపుతానని తెలిపారు.

Also Read :  వణికిస్తున్న తుపాను.. 14 లక్షల మంది నిరాశ్రయులు

Advertisment
తాజా కథనాలు