Elon Musk: రాబోయే ఐదేళ్లలో రోబోలే బెస్ట్ సర్జన్లు: ఎలాన్‌ మస్క్‌

రాబోయే ఐదేళ్లలో రోబోలే బెస్ట్ సర్జన్లుగా మారుతాయని ఎలాన్ స అంచనా వేశారు. ప్రస్తుతం తమ న్యూరాలింక్ కంపెనీలో మానవ మెదడులో కంప్యూటర్ ఎలక్ట్రోడ్‌లను అమర్చే పనులను రోబోతోనే చేయిస్తున్నామని చెప్పారు.

New Update
Elon Musk 3

Elon Musk 3

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. రాబోయే రోజుల్లో ఏఐ వల్ల అనేక రంగాల్లో ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఐదేళ్లలో రోబోలు వైద్యులను అధిగమిస్తాయని తెలిపారు. రోబోలే బెస్ట్ సర్జన్లుగా మారుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం తమ న్యూరాలింక్ కంపెనీలో మానవ మెదడులో కంప్యూటర్ ఎలక్ట్రోడ్‌లను అమర్చే పనులను రోబోతోనే  చేయిస్తున్నామని చెప్పారు.  

Also Read: తొక్కలో జాబ్ అని వదిలేశాడు..  ఆడి కారులో ఇంటింటికి పాలు అమ్ముతుండు!

సామాన్య మానవులకు ఈ పని చాలా కష్టమైనదనీ.. కానీ రోబో మాత్రం వేగంగా, కచ్చితత్వంతో పని చేస్తోందని పేర్కొన్నారు. ఇక భవిష్యత్తులో జరిగే శస్త్ర చికిత్సల్లో ఆధునిక టెక్నాలజీతో తయారుచేసిన రోబోల వాడకమే ఎక్కువవుతుందని చెప్పారు. దీంతో సర్జన్ల ఉద్యోగాలపై తీవ్రంగా ప్రభావం పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. మస్క్‌ అభిప్రాయంపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.  ప్రస్తుతం సర్జరీల కోసం వినియోగించే సర్జికల్ రోబోలు స్వయంగా పని చేయలేవని.. వాటిని మానవ సర్జన్లే నియంత్రిస్తారని ఓ నెటిజన్ అన్నారు.   

Also Read: నీతిలేని కుక్క టర్కీ.. ఇండియా సాయాన్ని మరిచి ఇప్పుడు పాక్‌కు ఆయుధాల సరఫరా

భవిష్యత్తులో టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా మానవ ప్రమేయం లేకుండా యంత్రాలు పని చేయలేవన్నారు. మస్క్ అంచనా నిజం కావాలంటే 5 ఏళ్లలో సాధ్యం కాదని.. దీనికి ఇంకా చాలాకాలం పడుతుందని చెప్పారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఎలాన్‌ మస్క్‌ను ప్రశ్నించారు. ఓ వైపు అధిక జనాభా కావాలని కోరుతూ.. మళ్లీ ఉద్యోగాలను రోబోలతో భర్తీ చేయాలని చూడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.  

Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ

Also Read: ఇది మీ చేతగాని తనం.. ఇండియన్ ఆర్మీపై షాహిద్ అఫ్రిది సంచలన కామెంట్స్!

Elon Musk | telugu-news | neuralink 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు