/rtv/media/media_files/2025/04/28/Q0ztctPAfKa7j6w0JyWo.jpeg)
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్నారు. సిద్ధరామయ్య గతంలో కూడా ప్రభుత్వం అధికారరులపై జులుం చూపించారు. కాంగ్రెస్ ర్యాలీలో ఒక పోలీసు అధికారిపై విరుచుకుపడ్డారు. ఓ ఐపీఎస్ అధికారిపై సీఎం సభా వేధికపైనే చేయి చేసుకోబోయారు. బెళగావిలో జరిగిన ర్యాలీలో అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)కి నల్ల జెండాలు చూపించడంతో ముఖ్యమంత్రి సహనం కోల్పోయారు. దీంతో ఆయనను చెంపదెబ్బ కొట్టబోయారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో వేదికపై నిలబడి సిద్ధరామయ్య అడిషనల్ ఎస్పీని స్టేజ్ మీదకు పిలిచారు. కొందమంది ప్రజలు నిరసన తెలిపేందుకు వేదిక లోపలికి వచ్చారు. నల్ల జెండాలు ప్రదర్శించారు. దీంతో ఆగ్రహించిన సిద్ధరామయ్య నిరసనకారులను లోనికి ఎలా అనుమతి ఇచ్చారని అడిషనల్ ఎస్పీని అడిగారు. అదంతా వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also read: BREAKING: టెర్రరిస్ట్ తహవూర్ హుస్సేన్ రాణాకు NIA కస్టడీ పొడిగింపు
Mr #Siddaramaiah nearly slaps a cop on duty!
— Aditi Bhardwaj (@Aditi14Bhardwaj) April 28, 2025
Chief Minister or Chief above Law? pic.twitter.com/CKZmB9jbcS
Also read: Pakistan: నీతిలేని కుక్క టర్కీ.. ఇండియా సాయాన్ని మరిచి ఇప్పుడు పాక్‌కు ఆయుధాల సరఫరా
ధార్వాడ్ అదనపు ఎస్పీ నారాయణ బరామణిపై సీఎం సిద్దరామయ్య చేయి ఎత్తాడు. అది చెంపదెబ్బ కొట్టినట్లుగా అనిపించింది. ఆ పోలీసు అధికారి వేగంగా వెనక్కి వెళ్లాడు. సిద్దరామయ్యపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పింస్తు్న్నారు. అధికారం శాశ్వతం కాదని జనతాదళ్ సెక్యులర్ లేదా జెడిఎస్, X పై పోస్ట్‌లో హెచ్చరించింది. పోలీసు అధికారిని కొట్టడానికి చేయి ఎత్తడం మీ పదవికి లేదా గౌరవానికి మంచిది కాదని మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మీ పదవీకాలం 5 సంవత్సరాలు మాత్రమే. కానీ ప్రభుత్వ అధికారి 60 సంవత్సరాల వయస్సు వరకు పనిచేస్తారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మీ దుష్ప్రవర్తనను సరిదిద్దుకోండని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. డిపార్ట్‌మెంట్‌కు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
(video-viral | CM Siddaramaiah | karnataka-cm-siddaramaiah | karnataka | hit IPS officer)