Floods: భారీ వరదలు.. 16 మంది మృతి

ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్సులో కుండపోత వర్షాల వల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరదల ప్రభావానికి సోమవారం తెల్లవారుజామున నదులు ఉప్పొంగాయి.

New Update
Heavy Floods in indonasia, 16 killed

Heavy Floods in indonasia, 16 killed

ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్సులో కుండపోత వర్షాల వల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరదల ప్రభావానికి సోమవారం తెల్లవారుజామున నదులు ఉప్పొంగాయి. సియావు తగులాండాంగ్‌ బియారో జిల్లాలో బురద, రాళ్లు, శిథిలాలతో కూడిన వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో పలు గ్రామాలు నీటమునిగాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి తెలిపారు. 

Also Read: ట్రంప్ మన ప్రధాని మోదీని కిడ్నాప్ చేస్తే.. కాంగ్రెస్ లీడర్ షాకింగ్ కామెంట్స్

ఈ వరదల ధాటికి 140కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. 680 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. రోడ్లు, సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. బాధితులకు వేగంగా సాయం అందించేందుకు సితారో జిల్లాలో సోమవారం నుంచి 14 రోజుల పాటు ఎమర్జెన్సీ విధించారు. 

Also Read: పిజ్జా..పెంటగాన్..యుద్ధం..ఈ కథేంటో మీకు తెలుసా?

Advertisment
తాజా కథనాలు