Indian Navy : అరేబియా మహాసముద్రంలో యాంటీ షిప్‌ మిసైల్స్‌ ప్రయోగం సక్సెస్!

ఎటువంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లుగా భారత నౌకాదళం ప్రకటించింది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో ప్రకటించింది.

New Update
Indian Navy

Indian Navy

ఎటువంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లుగా భారత నౌకాదళం ప్రకటించింది.  తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో ప్రకటించింది. పహల్గాములో ఉగ్రదాడి కారణంగా భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత నౌకాదళం సన్నద్ధతను పరీక్షించుకునేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది. సముద్ర జలాల్లో ఎప్పుడైనా.. ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్‌ నేవీ సిద్ధమని ప్రకటించింది.  పహల్గామ్ దాడి తర్వాత, ముందుకు వచ్చే ఎలాంటి ముప్పు నుండి దేశాన్ని రక్షించడానికి ఈ పరీక్షలు జరుగుతున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ కొత్త క్షిపణిని పరీక్షించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు