Jamili Elections: జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు..

జమిలి ఎన్నికల అంశంపై రామ్‌నాథ్‌ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీ సంవత్సరం ఓట్ల కోసం వచ్చే నేతలతో ఓటర్లు విసిగిపోయారన్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది దేశాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

New Update
KOVIND

జమిలి ఎన్నికల బిల్లు మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ అంశంపై రామ్‌నాథ్‌ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది దేశాభివృద్ధికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. ఓ ఆదివాసి సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. '' ప్రతీ సంవత్సరం ఓట్ల కోసం వచ్చే నేతలతో ఓటర్లు విసిగిపోయారు. తరచూ ఇలాంటి పరిస్థితి రావాలని కోరుకోవడం లేదు. 

Also Read: కంపెనీలో సిబ్బందికి పనిష్మెంట్‌.. 30 నిమిషాలు నిల్చోవాలంటూ సీఈవో ఆదేశం

జమిలి ఎన్నికల ప్రతిపాదన 2029-30లో పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చాక ఏదో ఒక ఎన్నిక కోసం ఓటర్లు ప్రతీ ఏడాది పోలింగ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. జమిలి విధానం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న జీడీపీకి అదనంగా మరో 1.5 శాతం పెరుగుతుంది. ఒకవేళ ఇదే జరిగినట్లైతే జీడీపీ 10 శాతం పెరిగేందుకు కూడా ఎక్కువ సమయం పట్టదు. దీంతో ప్రపంచంలో మూడో, నాలుగో ఆర్థిక శక్తిగా ఇండియా నిలుస్తుందని'' మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు.    

ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!

మరోవైపు జమిలి ఎన్నికల రిపోర్టుపై కూడా ఆయన స్పందించారు. ఉన్నతస్థాయి కమిటీ ఛైర్మన్‌గా తాను అనేక రాజకీయ పార్టీల నేతలు, ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమైనట్లు పేర్కొన్నారు. మొత్తంగా వీటికి సంబంధించిన 18 వేల పేజీల రిపోర్టు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అందరికీ అందుబాటులో ఉందని తెలిపారు. ఎలాంటి గ్రంథాలయాలకు వెళ్లకుండానే వాటన్నింటినీ చూడొచ్చని తెలిపారు. 

Also Read: మహిళలకు గుడ్‌న్యూస్.. 10పాసైతే చాలు వేలల్లో ఆదాయం..కొత్త స్కీమ్ సూపర్?

Also Read: సర్పంచ్ ఎన్నికలపై కీలక నిర్ణయం.. ఐదేళ్లకొకసారి రిజర్వేషన్లలో మార్పు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు