సర్పంచ్ ఎన్నికలపై కీలక నిర్ణయం.. ఐదేళ్లకొకసారి రిజర్వేషన్లలో మార్పు

సర్పంచ్ ఎన్నికల్లో ఐదేళ్లకు ఒకసారి రిజర్వేషన్లలో మార్పులు చేస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులనే నిబంధను కూడా తొలగించింది.

New Update

సర్పంచ్ ఎన్నికలపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2018 పంచాయతీ రాజ్ చట్టాన్ని పక్కన పెట్టి.. సర్పంచ్ ఎన్నికలు రిజర్వేషన్లలో మార్పులు చేసింది. ఇక నుంచి ప్రతీ ఐదేళ్లకు ఒకసారి రిజర్వేషన్‌లో మార్పులు ఉంటాయని తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో పదేళ్ల పాటు ఒకే రిజర్వేషన్ ఉండేది. కానీ ఇకపై ఐదేళ్లకు ఒకసారి తప్పకుండా మార్చాలని నిర్ణయం తీసుకుంది. అలాగే సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ను తొలగించేందుకు కలెక్టర్లకు ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాతే..

ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులనే నిబంధను తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. గతంలో కూడా సర్పంచ్ ఎన్నికల కంటే ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే నిర్వహించారట. సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికలను నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్‌లు లేక గ్రామాలు బోసిపోయి ఏడాది అవుతుంది. స్పెషల్ ఆఫీసర్‌తో గ్రామాల్లో పాలన జరుగుతోంది. దీనివల్ల తొందరగానే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

ఇది కూడా చూడండి: లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు.. ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి

సంక్రాంతి తర్వాతే ఎన్నికలకు నోటిఫికేషన్

ఇకనైనా పంచాయతీ ఎన్నికలను నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఫిబ్రవరి పూర్తయ్యే సరికి సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఎందుకంటే సర్పంచ్‌లు పాలన లేక ఏడాది అవుతుంది. దీనివల్ల గ్రామాల్లో కొన్ని బిల్లులు పెండింగ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి వల్ల రాష్ట్రంలో తొందరగానే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. 

ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్

ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు