/rtv/media/media_files/2025/10/09/forbes-list-2025-10-09-12-33-23.jpg)
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. తాజాగా విడుదలైన ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం, అంబానీ $105 బిలియన్ల (సుమారు రూ. 8.75 లక్షల కోట్లు) నికర సంపదతో ఇండియాలోనే ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికాం, డిజిటల్ సేవలతో సహా పలు రంగాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సాధించిన అద్భుతమైన వృద్ధి కారణంగా అంబానీ సంపద భారీగా పెరిగింది. ఆయన సంపద ఈ ఏడాది $100 బిలియన్ల మైలురాయిని దాటి, భారతీయ వ్యాపార సామ్రాజ్యాల బలాన్ని మరోసారి నిరూపించింది.
Mukesh Ambani beats Gautam Adani to top Forbes India billionaires list 2025. With a net worth of $105 billion, Ambani remains a centibillionaire.
— Business Standard (@bsindia) October 9, 2025
Details: https://t.co/H9sB5wgt7p#MukeshAmbani#GautamAdani#ForbesIndia#BILLIONAIRE#RIL | @BorisPradhan
జాబితాలో అదానీ స్థానం:
ముకేశ్ అంబానీ తర్వాత, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ రెండవ స్థానంలో నిలిచారు. ఆయన సంపద $92 బిలియన్లుగా (సుమారు రూ.7.67 లక్షల కోట్లు) ఉంది. అదానీ గ్రూప్ పోర్ట్‌లు, పవర్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఆయన బిజినెస్ పెద్ద ఎత్తున డెవలప్ అయ్యింది.
1.ముఖేష్ అంబానీ $105 బిలియన్లురిలయన్స్ ఇండస్ట్రీస్
2. గౌతమ్ అదానీ$92 బిలియన్లుఅదానీ గ్రూప్
3. సావిత్రి జిందాల్ & ఫ్యామిలీ$40.2 బిలియన్లుఓ.పి. జిందాల్ గ్రూప్
4. సునీల్ మిట్టల్$34.2 బిలియన్లుభారతీ ఎంటర్‌ప్రైజెస్
5. శివ్ నాడార్$33.2 బిలియన్లుహెచ్‌సీఎల్ టెక్నాలజీస్
6. సైరస్ పూనావాలా$25.1 బిలియన్లుసీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
7.దిలీప్ సంఘ్వి$24.5 బిలియన్లు (అంచనా)సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్
8. కుమార్ మంగళం బిర్లా$20.7 బిలియన్లుఆదిత్య బిర్లా గ్రూప్
9.రాధాకిషన్ దమాని$18.3 బిలియన్లు (అంచనా)డీమార్ట్ (అవెన్యూ సూపర్‌మార్ట్స్)
10.లక్ష్మీ మిట్టల్$18.7 బిలియన్లు (అంచనా)ఆర్సెలర్ మిట్టల్
భారతీయ ధనవంతుల మొత్తం సంపద రికార్డు:
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, భారతదేశంలోని టాప్ 100 ధనవంతుల మొత్తం సంపద మొదటిసారిగా $1 ట్రిలియన్ (సుమారు రూ. 83 లక్షల కోట్లు) మైలురాయిని అధిగమించింది. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న తీరుకు, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడులకు నిదర్శనంగా నిలిచింది. ముకేశ్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగడం, దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. దేశంలో పరిశ్రమలు, సాంకేతిక రంగాలలో అంబానీ తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, భవిష్యత్ లోనూ ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేయగలవని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.