ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఇటీవల ఈ రెండు పార్టీల మధ్య విబేధాలు తలెత్తాయి. ఒకదానికొకటి తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్ష ఇండియా కూటమిని ఉద్దశిస్తూ ఘాటుగా స్పందించారు. ఆప్, కాంగ్రెస్‌ల మధ్య విభేదాలు తలెత్తడంతో విపక్షాల మధ్య ఐక్యత లేనందున ఇండియా కూటమికి ముగింపు పలకాలని వ్యాఖ్యానించారు. Also Read: మహారాష్ట్రలో ఘోరం.. రూ. 500 కోసం సొంత తమ్ముడి హత్య.. అసలేం జరిగిందంటే ? కేంద్రంలో ఎన్డీయే కూటమిని ఓడించాలని లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమికి సంబంధించి ప్రస్తుతం ఏ సమావేశం కూడా జరగలేదు. కూటమికి నేతృత్వం ఎవరు వహిస్తారు. దీని అజెండా ఏంటి ?. ఇది ఎలా ముందుకు సాగుతుంది ? అనే అంశాలపై అసలు ఎలాంటి చర్చలు జరగడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ కూడా రాకుండా చేసేందుకు కూటమి శ్రమించింది. కానీ ఇప్పుడు దీని భవిష్యత్తుపై ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. మనం ఐక్యంగా ఉంటామా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. Also Read: తిరుపతి ఘటన..తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ మీటింగ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధం కావాలి. కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే కూటమి ఏర్పడినట్లయితే ఈ పొత్తుకు ముగింపు పలకండి. కూటమిని మూసివేయండి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి. దీనిపై చర్చలు జరిపి ఒక స్పష్టతకు రావాల్సిన అవసరం ఉందని'' ఒమర్ అబ్దుల్లా అన్నారు . Also Read: లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు..అగ్నికి ఆహుతైన బైడెన్ కుమారుడి ఇల్లు Also Read: అద్భుతమైన అరోరా వీడియోను పోస్ట్ చేసిన నాసా వ్యోమగామి