Hyderabad crime news
TG Crime: హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి ప్రాంతంలో దారుణ హత్య ఒకటి చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మనోజ్ అనే యువకుడు రాత్రి స్కూటీపై వెళ్తుండగా అతని స్నేహితుడైన సంజయ్ ఆకస్మికంగా అతనిపై దాడికి పాల్పడ్డాడు. ఈ హింసాత్మక దాడిలో మనోజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరూ మితృబంధంతో కొనసాగుతున్నప్పటికీ..పాత కక్షలు ఈ హత్యకు దారితీసినట్టు పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం.
ప్రాణం తీసిన స్నేహితుడు:
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మనోజ్‌పై సంజయ్ ప్రణాళికాబద్ధంగా దాడి చేశాడని అనుమానిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వస్పత్రికి తరలించారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం. మనోజ్ మంచి వ్యక్తిగా పేరున్న.. ఇటీవల అతని స్నేహితుడితో కొన్ని ఒప్పందాలు లేదా ఆస్తి సంబంధిత వివాదాలు జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: చిన్న పిల్లలకు వెండి నగలు పెట్టడానికి కారణం ఏమిటి?
ఈ హత్య చైతన్యపురిలో భయాందోళనకు దారితీసింది. యువత మధ్య పెరుగుతున్న అసహనం పెరుగుతుంది. చిన్నతనంలో కలిసి పెరిగిన స్నేహితులు ఇంతటి ఘోరానికి దిగడం దురదృష్టకరం. సమాజంలో వ్యక్తిగత విభేదాలు చర్చల ద్వారా పరిష్కరించకుండా.. హింస మార్గంలోకి వెళ్లడం రోజు రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు పూర్తిస్థాయి విచారణ అనంతరం మరిన్ని విషయాలు వెల్లడించనున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సంజయ్‌ను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉత్తమ పండ్లు ఇవే
( ts-crime | ts-crime-news | latest-news)