/rtv/media/media_files/2025/08/09/pak-2025-08-09-21-32-47.jpg)
Not a single Pakistani aircraft was hit or destroyed by Indian armed forces, Says Pakistan
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన ఆరు యుద్ధ విమానాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వ్యాఖ్యలపై పాకస్థాన్ స్పందించింది. ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేసినప్పటికీ తమ సైన్యానికి సంబంధించి ఒక్క విమానం కూడా దెబ్బతినలేదంటూ బుకాయించింది.
Also Read: ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్..బాహుబలి కొండ దగ్గర తవ్వకాలు
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ''భారత్ చేసిన దాడుల్లో పాక్‌కు చెందిన ఒక్క యుద్ధ విమానం కూడా దెబ్బతినలేదు. మేము అంతర్జాతీయ మీడియాకు ఈ వివరాలు చెప్పాం. 3 నెలలుగా దీనిపై ఎలాంటి వాదనలు రాలేదు. ఇంత ఆలస్యంగా మీరు వాదనలు చేసినప్పటికీ అవి నమ్మశక్యంగా లేవని'' ఖవాజా ఆసిఫ్ అన్నారు.
ఇదిలాఉండగా.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే శనివారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి వాయుసేన సేనాధిపతి ఏపీ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి పలు వివరాలు వెల్లడించారు. ''ఆపరేషన్ సిందూర్‌ను పక్క ప్లాన్‌తో నిర్వహించాం. కేవలం 80 నుంచి 90 గంటల్లోనే మా టార్గెట్‌ను సాధించాం. ఇరుదేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగితే పాకిస్థాన్‌కు భారీ నష్టం తప్పదని వాళ్లు తెలుసుకున్నారు. ఇందుకోసం మనతో కాళ్ల బేరానికి వచ్చారు. భారత్‌తో చర్చలు జరుపుతామంటూ చెప్పారు. మేము దీనికి అంగీకరించాం. సిందూర్ సమయంలో పాక్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలు.. మరో పెద్ద విమానాన్ని కూడా ధ్వంసం చేశాం.
Also Read: న్యూయార్క్ టైం స్క్వేర్‌లో కాల్పులు జరిపిన 17 ఏళ్ల బాలుడు.. భయంతో పరుగులు తీసిన జనం
"5 Pak Fighter Jets Shot Down During Op Sindoor" : Air Marshall Chief Amar Preet Singh Confirms Specifics On IAF Kills, Lists Devastating Pakistani Losses
— NDTV (@ndtv) August 9, 2025
NDTV's @VishnuNDTV breaks down the details pic.twitter.com/YWCALBQuGp
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసినటువంటి పాకిస్థాన్ ప్రధాన ఎయిర్‌ఫీల్డ్‌లలో షహబాజ్ జకోబాబాద్ స్థావరం ఉంది. అక్కడ ఎఫ్ 16 హ్యాంగర్ ఉండగా దానిపై మన సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో ఎఫ్ 16 సగానికి పైగా దెబ్బతింది. అక్కడ మరికొన్ని యుద్ధ విమానాలు ఉండగా.. అవి కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు మేము అంచనాకు వచ్చామని'' ఏపీ సింగ్ తెలిపారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాక్ రక్షణ శాఖ మంత్రి స్పందించారు. తమ యుద్ధ విమానాలు ఒక్కటి కూడా ధ్వంసం కాలేదంటూ చెప్పుకొచ్చారు. ఇరు దేశాలు ఈ వివాదంపై మరోసారి వాదించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: పాపం అక్క.. సోదరుడికి రాఖీ కట్టేందుకు 14 ఏళ్లుగా ఎదురుచూపులు