/rtv/media/media_files/2025/08/01/dharmasthala-mass-burial-case-2025-08-01-07-17-08.jpg)
Dharmasthala Mass Burial Case
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక(Karnataka) లోని ధర్మస్థల(Dharmasthala case) సామూహిక ఖననాల కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరో కొత్త ప్రదేశంలో తవ్వకాలను చేపట్టింది. బాహుబలి కొండదగ్గర తవ్వకాలు ప్రారంభించాలని సిట్ భావిస్తోంది. కొండ సమీపంలోనే శవాలను పూడ్చినట్లు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు సిట్‌కు సమాచారం ఇవ్వడంతో కొండ చుట్టూ మార్కింగ్ చేసిన ప్రతీ చోట తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికుడుడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తవ్వకాల నిర్వహిస్తున్న సమయంలో సిట్‌తో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, సాంకేతిక సిబ్బంది కూడా ఆ ప్రదేశంలో ఉన్నారు.
ఈ తవ్వకాలను కఠినమైన భద్రత మధ్య నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. అయితే ఆ స్థలం నుంచి కనుగొన్న వాటి గురించి ఇప్పటివరకు వెల్లడించలేదు. అన్ని ఆధారాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని అన్నారు. తదుపరి చర్యలు, ఫోరెన్సిక్ నివేదికలు చట్టపరమైన ప్రక్రియల ఆధారంగా ఉంటాయని తెలిపారు. అయితే, ఈ దర్యాప్తు ప్రజలు, రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చలకు దారి తీసిందని అధికారులు అన్నారు.అయితే తవ్వకాలు సాగిస్తు్న బాహుబలి కొండ చుట్టూ భారీ వృక్షాలు ఉండటంతో --- భారీ చెట్లను తొలగించేందుకు సిబ్బంది కష్టపడుతున్నారు. ధర్మస్థలలో సిట్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 13 ప్రాంతాల్లో సిట్ తవ్వకాలు చేపట్టింది. మరికొన్ని చోట్ల తవ్వకాలు జరిపేందుకు సిట్ నిర్ణయించింది. అయితే ధర్మస్థలలో భారీగా మృతదేహాలు దొరికినట్లు ప్రచారం సాగుతోంది. పుర్రెలు, ఎముకలు, మహిళల వస్తువులు దొరికినట్లు ప్రచారం కొనసాగుతోంది.500 మంది అమ్మాయిలను అత్యాచారం చేసి చంపేశారంటూ ఆరోపణలు వినవస్తున్నాయి.
మరోవైపు ధర్మస్థలలో సామూహిక ఖననాల కేసును వెల్లడించకుండా మీడియాను నిరోధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆలయాన్ని నిర్వహిస్తున్న కుటుంబమే లక్ష్యంగా పలు మీడియా కథనాలు వస్తున్నాయని ధర్మస్థల ఆలయ కార్యదర్శి వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు తన అభిప్రాయాన్నివెల్లడించింది. పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ ధర్మస్థల ఆలయ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌ను పునఃపరిశీలించాలని కర్ణాటకలోని ట్రయల్ కోర్టును ఆదేశించింది. అయితే చాలా అరుదైన కేసుల్లో మాత్రమే గ్యాగ్ ఆర్డర్లు జారీ చేస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అన్ని విషయాలను ట్రయల్ కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది.
Also Read : పాపం అక్క.. సోదరుడికి రాఖీ కట్టేందుకు 14 ఏళ్లుగా ఎదురుచూపులు
అసలేం జరిగిందంటే...
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన ధర్మస్థలిలో 1998- 2014 మధ్య అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని ఓ విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పూడ్చి పెట్టిన మృతదేహాలన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైనవారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని అందులో పేర్కొన్నాడు. మరుసటి రోజు ఈ విషయమై మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సదరు కార్మికుడు జులై 11న బెళ్తంగడి న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చాడు. గతంలో పాతిపెట్టిన ఓ మృతదేహా అస్థిపంజర అవశేషాలు సహా సంబంధిత ఫొటోలను ఆధారాలుగా తీసుకొచ్చాడు. అదే సమయంలో ఆ హత్యలకు కారణమైన వారి పేర్లను కూడా పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే కేసు విచారణ సరైన రితీలో జరగడం లేదని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వారి ఆరోపణతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేయగా, ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారంతో తవ్వకాలు ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో ఎముకలు కూడా లభించాయి.
Also Read : రాజకీయ పార్టీలకు ఈసీ జలక్.. 334 పార్టీలపై వేటు