New York: న్యూయార్క్‌ టైం స్క్వేర్‌లో కాల్పులు జరిపిన 17 ఏళ్ల బాలుడు.. భయంతో పరుగులు తీసిన జనం

న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌లో కాల్పులు చోటుచేసుకోవడం సంచలనం రేపింది. భయంతో ప్రజలు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
3 Injured In Shooting At New York's Times Square, Video viral

3 Injured In Shooting At New York's Times Square, Video viral

న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌లో కాల్పులు చోటుచేసుకోవడం సంచలనం రేపింది. భయంతో ప్రజలు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లలో కూడా ఒక యువతి కూడా ఉంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వాళ్లని ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 17 ఏళ్ల యువకుడు ఈ కాల్పులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. అతని ఫొటోలు కూడా బయటికొచ్చాయి.

Also Read: శాంతి ఒప్పందం కోసం ఆ పని చేసేది లేదు.. ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చిన జెలెన్‌స్కీ

నిందిడిని విచారించిన పోలీసులు అతడి నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉండగా ఇటీవలే న్యూయార్క్‌ నగరంలో గన్‌ క్రైమ్‌ కల్చర్ తగ్గుతోందని ఇటీవలే అక్కడి పోలీస్ కమిషనర్‌ ప్రకటించారు. కొన్ని రోజులకే అక్కడ ఇలాంటి కాల్పులు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్‌ వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. 

ఇదిలాఉండగా గత నెలలో కూడా ఇలాంటి కాల్పులే జరిగాయి. జులై 29న న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ ఆఫీసు భవనంలో కాల్పులు జరగగా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం దుమారం రేపింది. NYPD అధికారితో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తి లాస్‌ వెగాస్‌కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురాగా గుర్తించారు. అతడు కూడా గాయాలతో మృతి చెందినట్లు పేర్కొన్నారు.   

Also Read: పాపం అక్క.. సోదరుడికి రాఖీ కట్టేందుకు 14 ఏళ్లుగా ఎదురుచూపులు

ఇక ఈ ఏడాదిలోని మే 27న పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో ఉన్న ఫెయిర్‌మౌంట్‌పార్కులో సైతం కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మైనర్లు మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. మేమోరిడియల్ డే సందర్భంగా ఆ ప్రాంతంలో అత్యధికంగా జనసంచారం ఉంది. ఆ సమయంలోనే రాత్రి 10.30 గంటలకు కాల్పులు జరిగాయి. అమెరికాలో ఇలా వరుసగా కాల్పులు జరగడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు