/rtv/media/media_files/2025/05/24/zBxhLqIhsgXN5xGAYbMv.jpg)
India In UN
ఎంత చెప్పినా పాకిస్తాన్ కాశ్మీర్ అంశం గురించి మాత్రం మాట్లాడుతూనే ఉంది. భారత్ తో చర్చ కాకుండా అన్నిచోట్లా నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది. ఐక్యరాజ్యసమితిలో పాక్ రాయబారి అసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ మరోసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటూ ఈ మధ్య కాలంలో భారత్, పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల గురించి మాట్లాడారు. దీనికి భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది. అసలు పాకిస్తాన్ కు మాట్లాడే హక్కు లేదని కూడా చెప్పింది.
Also Read: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం
లోపల ఉగ్రవాదంతో సహవాసం..పైకి సూక్తులు..
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ...పాకిస్తాన్ అనవసరంగా మాట్లాడుతోందని అన్నారు. భారత్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఎప్పటి నుంచో భారత్ ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా పోరాడుతోంది. కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రజల్లా పెంచిపోషిస్తోంది. అలాంటి వారికి అసలు మాట్లాడే హక్కు ఎక్కడ నుంచి వస్తుందని హరీశ్ విరుచుకుపడ్డారు. పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను నిర్వహించి పాక్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. కానీ పాకిస్తాన్ ఏం చేసింది..ఈ దాడుల్లో మృతిచెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆ దేశ సీనియర్ ప్రభుత్వ, పోలీసు, సైనిక అధికారులు హాజరై నివాళులర్పించారు. ఉగ్రవాదులు, పౌరుల మధ్య తేడాను గుర్తించని ఆ దేశానికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదు అని హరీశ్ అన్నారు.
Also Read: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం
పాకిస్తాన్ ది అంతా కపటత్వమని..చేసినదంతా చేసి ఇప్పుడు సూక్తులను వెల్లడిస్తోందని హరీశ్ విమర్శించారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఘర్షణల సమయంలో కూడా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. గురుద్వారాలు, దేవాలయాలు, సైనిక స్థావరాలను కావాలనే లక్ష్యంగా చేసుకొందని తెలిపారు. వీటిల్లో 20 మందికి పైగా మృతి చెందారు...80 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాఖ్య కలిసి పోరాడాలని...వారికి ఆశ్రయం కల్పిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీశ్ పిలుపునిచ్చారు.
Also Read: సన్నగా ఉంటే గుండెపోటు వస్తుందా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి
today-latest-news-in-telugu | un | india | pakistan | terrorism
Also Read: Germany: జర్మనీలో రెచ్చిపోయిన దుండుగురాలు..రైల్వే ఫ్లాట్ ఫామ్ లో దాడి..17 మందికి గాయాలు