/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T094512.156.jpg)
Horoscope
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చిత్తశుద్ధితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులు పెండింగ్ పనులు పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు బాగుంటుంది.
Also Read: America: అమెరికా నుంచి మరో రెండు విమానాల్లో భారతీయులు..మండిపడుతున్న పంజాబ్!
వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా గొప్ప శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధికంగా సానుకూల పరిస్థితులు ఉంటాయి. మీ నిజాయితీ, ఆత్మ విశ్వాసం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.
Also Read: Modi-Trump: ట్రంప్ తో మోదీ భేటీ..ఏ విషయాలు గురించి చర్చించుకున్నారంటే!
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారులు తెలివిగా, జాగ్రత్తగా పెట్టుబడి పెడితే ఊహించని లాభాలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు విడిచి పెట్టండి. కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఓ సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. చేపట్టిన ప్రతీ పని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢపడుతుంది. మీ శ్రద్ధ, పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి.
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మాచరణతో ముందుకెళ్లి పేరుప్రఖ్యాతులు సాధిస్తారు. బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ముఖ్యమైన చర్చలు, సమావేశాలలో మీ నిర్ణయం కీలమవుతుంది.
కుటుంబంతో సరదాగా..
తులారాశి వారికి ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తారు. దైవబలం అండగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. శ్రద్ధాసక్తులతో పనిచేస్తే సత్ఫలితాలుంటాయి. వివాదాలకు, వదంతులకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. వృథా ఖర్చులు నివారించాలి.
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. విలాసాల కోసం అధిక ధనవ్యయం చేస్తారు.
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య సంబంధించిన ఖర్చులు ఉండవచ్చు. ధార్మిక, సామాజిక కార్యక్రమాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. సానుకూల ఆలోచనలతో మేలు కలుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.
కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో మంచి,ప్రేమపూరితమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఆనందం, ఉత్సాహం ఉంటుంది. మీ పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిసికట్టుగా అద్భుతాలు సృష్టిస్తాయి.
మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఆచి తూచి అడుగేయాలి. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి. బంధుమిత్రులతో వివాదాలకు అవకాశం ఉంది. ఆర్థిక నష్టం సంభవించే సూచన ఉంది జాగ్రత్తగా ఉండండి.
Also Read: Bengaluru Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్.. తగ్గిన ఛార్జీలు
Also Read: TS: నగరంలో ట్రాఫిక్ ను నియంత్రణకు ఫ్లై ఓవర్లు- సీఎం రేవంత్ రెడ్డి