రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం

న్యూఢిల్లీ నుంచి జమ్మూ కశ్మీర్ కత్రా వెళ్తున్న వందే భారత్ రైలులో నాన్ వాజ్ నిషేధం. పవిత్రమైన శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే భక్తులు రైలులో స్వచ్ఛమైన శాఖాహారం అందడం లేదని ఆరోపించారు. దీంతో రైల్వే శాఖ నాన్ వెజ్‌ను నిషేధిస్తున్నట్లు తెలిపింది.

New Update
vande bharat

Vande Bharat

దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. అన్ని లైన్లలో కూడా వందే భారత్‌ రైళ్లు వేస్తున్నారు. అయితే ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ భోజనం సదుపాయం కూడా కల్పించింది. వెజ్, నాన్ వెజ్ రెండు కూడా ఇచ్చేవారు. కానీ ఇకపై ఓ వందే భారత్‌ రైళ్లలో కేవలం వెజ్ ఫుడ్‌ను మాత్రమే ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. న్యూఢిల్లీ నుంచి కత్రాలోని శ్రీ మాతా వైష్ణో దేవికి వెళ్లే వందే భారత్ రైలులో నాన్ వెజ్‌ను నిషేధించింది. 

ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!

ఇది కూడా చూడండి: India vs England 5th T20I: టీమిండియా ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు!

స్వచ్ఛమైన శాఖాహార భోజనం..

రైల్వే క్యాంటీన్‌లో వెజ్‌, నాన్‌వెజ్‌ ఫుడ్‌ తయారు చేసేటప్పుడు ఎలాంటి తారతమ్యం ఉండదు. దీంతో కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేయగా.. రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. వెజ్ కావాలని ఆర్డర్ చేసిన కూడా స్వచ్ఛమైన శాఖాహార భోజనం అందడం లేదని ఆరోపించారు. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ పూర్తిగా నాన్‌ వెజ్‌ను నిషేధించింది. 

ఇది కూడా చూడండి: Israel: నెతన్యాహు సతీమణి పై నేర విచారణ!

శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయం ఒక పవిత్రమైన ధార్మిక ప్రదేశం. జమ్మూ కశ్మీర్‌లోని కత్రాలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా వెళ్తుంటారు. ముఖ్యంగా వందే భారత్ రైలుకు వెళ్లడంతో మంసాహారం తీసుకురావడం వల్ల కొందరికి ఇబ్బంది వస్తుంది. అందుకే ఈ రైలులోకి మాంసాహారంతో ఉన్న స్నాక్స్ అన్ని కూడా నిషేధించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు