/rtv/media/media_files/2025/11/04/tejashwi-yadav-2025-11-04-15-34-12.jpg)
Tejashwi Yadav
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఫలితాలు కూడా మహాఘట్‌బంధన్ కూటమికి నిరాశే మిగిల్చాయి. ఆ రాష్ట్రా ప్రజలు ఎన్డీయేకు జైకొడుతున్నారు. మ్యాజిక్ ఫిగర్‌కుపైగా స్థానాల్లో బీజేపీ, జేడీయూ పార్టీల నాయకులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బిహారీలు అసెంబ్లీ ఎన్నికల వార్ వన్ సైడ్ డిసైడ్ చేశారు. 243 స్థానాల్లో దాదాపు190 నియోజకవర్గాల కౌంటింగ్‌లో ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బిహార్ రాజకీయాల్లో దూసుకొచ్చిన యువ నాయుకుడు తేజస్వీ యాదవ్‌కు సీఎం పదవి అందన ద్రాక్షలా అయ్యింది. 2017 నుంచి మూడు సార్లు ఆయన సీఎం అయ్యే అవకాశం చేజారుపోయాయి. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్‌కు ముఖ్యమంత్రి పీఠం మూడు ప్రధాన సందర్భాల్లో దాదాపుగా అందినట్టే అంది చేజారిపోయింది. ఉప ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేసిన అనుభవం ఉన్నా, పూర్తి స్థాయి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాజకీయ సమీకరణాల వల్ల దూరమైంది.
2017లో నితీష్ కుమార్ అనూహ్య నిర్ణయం
తేజస్వి యాదవ్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దగ్గరగా వచ్చి, తృటిలో తప్పిపోయిన మొదటి సందర్భం 2017. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిసి మహాఘట్‌బంధన్ కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా, తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, 2017లో తేజస్వి యాదవ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలను (ఐఆర్‌సీటీసీ కుంభకోణం) సాకుగా చూపి, నితీష్ కుమార్ అనూహ్యంగా మహాఘట్‌బంధన్ నుంచి వైదొలిగారు. జేడీయూ వెంటనే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరిపోవడంతో తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రి పదవి కోల్పోయాడు. ప్రతిపక్ష నేతగా మారారు. ఈ అనూహ్య రాజకీయ మలుపుతో, తేజస్వికి ఉన్న సీఎం అయ్యే అవకాశం పూర్తిగా సన్నగిల్లిపోయింది.
2020లో కాంగ్రెస్ వైఫల్యం
తేజస్వికి దాదాపు విజయం అందించిన రెండో అవకాశం 2020 అసెంబ్లీ ఎన్నికలు. తేజస్వి యాదవ్ నిరుద్యోగం, 10 లక్షల ఉద్యోగాల హామీని ప్రధాన అస్త్రాలుగా చేసుకొని అద్భుతంగా ప్రచారం నిర్వహించారు. ఆయన నాయకత్వంలో ఆర్జేడీ 75 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆర్జేడీ మంచి ప్రదర్శన చేసినప్పటికీ, మహాఘట్‌బంధన్ కూటమిలోని కాంగ్రెస్ పార్టీ కేవలం 19 సీట్లకే పరిమితమైంది. దీంతో కూటమి మొత్తంగా మెజారిటీ మార్కు (122)ను అందుకోలేకపోయింది. కాంగ్రెస్ వైఫల్యం వల్ల కీలకమైన ఓట్లు, సీట్లు కోల్పోవడంతో ఎన్డీఏ (బీజేపీ 74, జేడీయూ 43) కూటమి 125 సీట్లతో స్వల్ప తేడాతో మళ్లీ అధికారాన్ని చేపట్టింది. ఈ సందర్భంలో కేవలం కొన్ని సీట్ల దూరంలోనే తేజస్వి ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు.
Follow Us