/rtv/media/media_files/2025/04/23/GXG1Mbds9Yzt9Oha9PnX.jpg)
National Herald case
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో వీరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చార్జి షీట్‌లో ఉంచిన విషయం తెలిసిందే. రూ.5000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులని మళ్లించడానికి ప్రయత్నించారని వీరిని ప్రధాన సూత్రధారులు వీరేనని తెలిపింది. అయితే ఈ కేసు మూలాలు ఇప్పటివి కాదని.. 1950 నాటివి అని బీజేపీ అంటోంది. గతంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. 1954లో సర్దార్ వల్లభాయ్ పటేల్ లేఖను చూసి ఆందోళన చెందినట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
అవినీతి మార్గంలోకి వెళ్లిందని..
ప్రభుత్వం పేరుని ఉపయోగించుకుని నిధులను సేకరించడం గురించి జవహర్ లాల్ నెహ్రూ అలర్ట్ చేశారు. అక్రమ మార్గాల ద్వారా వచ్చే నిధులను అంగీకరించవద్దని తెలిపారట. అప్పుడే కాంగ్రెస్ పార్టీ బాధ్యత లేకుండా అవినీతి మార్గంలోకి వెళ్లిందని కొందరు విమర్శకులు అంటున్నారు. పటేల్ అప్పుడు చెప్పినవే ఇప్పుడు నిజమయ్యాయని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులు రాహుల్, సోనియా ఆధీనంలో ఉన్నాయి. అయితే వీటిని యంగ్ ఇండియన్ లిమిటెడ్ రహస్యంగా స్వాధీనం చేసుకుందని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
నేషనల్ హెరాల్డ్‌కి 1950లో హిమాలయన్ ఎయిర్ వేస్ నుంచి 75 వేల రూపాయలు విరాళం వచ్చింది. విరాళం ఇచ్చిన వాళ్లలో అఖాని ఒకరిని బ్యాంకుని మోసం చేసిన కేసు ఆయనపై ఉందని పటేల్ తెలిపారు. కొందరు వ్యాపారులు అప్పట్లో విరాళాలు ఇచ్చారని కేంద్ర మంత్రి అహ్మద్ కిద్వాయ్ ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని నెహ్రూ అప్పట్లో సీరియస్‌గా తీసుకోలేదు. సీరియస్‌గా తీసుకుంటే ఇంత పెద్ద కుంభకోణం జరిగి ఉండేది కాదని అంటున్నారు.
ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!
ఇప్పుడు తాజాగా బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి మొత్తం బయటకు కదిలించారు. ప్రభుత్వ ఆస్తుల్ని గాంధీ కుటుంబానికి చెందిన వారు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన వాదనలను బీజేపీ విమర్శలు ఆరోపణలకు దగ్గరగా ఉన్నాయి. బీజేపీ ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ కుటుంబ సంస్థల పని చేసిందని రాజకీయ పలుకుబడిని వ్యక్తిగతంగా ఉపయోగించుకుందని. రాజకీయ కక్ష్య సాధింపు చర్యగా కాంగ్రెస్ వాదిస్తున్నా ఈడి చార్జ్‌షీట్‌లో ఉన్న అంశాల ముందు ఏమి మాట్లాడలేకపోతోంది. అయితే బీజేపీ మాత్రం అంత ఈజీగా వదిలేటట్లు కనిపించడం లేదు.
ఇది కూడా చూడండి: Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!