/rtv/media/media_files/2025/05/12/fBuLDMBDsCLtUcTB51TG.jpg)
PM Modi
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అత్యంత ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రెండవ వ్యక్తిగా మోదీ చరిత్రకెక్కారు. ఈ రోజుతో ప్రధాని మోదీ 4,078 రోజులు పదవీకాలం పూర్తి చేసుకున్నారు. దీంతో 1966 జనవరి 24 నుండి 1977 మార్చి 24 వరకు వరుసగా 4,077 రోజులు ప్రధానమంత్రిగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ రికార్డును ఈయన బద్దలుకొట్టారు.
మోదీ ఖాతాలో మరెన్నో ఘనతలు..
దీంతో పాటూ ప్రధాని మోదీ మరికొన్ని ఘనతలను సాధించారు. స్వాతంత్రం తరువాత పుట్టి..ఎక్కువ కాలం పని చేసిన ఏకైక ప్రధానిగా మోదీ ఘనత వహించారు. అంతేకాదు హిందీ మాట్లాడని రాష్ట్రం నుంచి వచ్చిన అత్యధిక కాలం పనిచేసిన ప్రధిన కూడా ఈయనే. అలాగే రెండు సార్లు పదవీ కాలం పూర్తి చేసుకోవడమే కాదు. రెండు సార్లూ మెజారిటీతో ఎన్నికైన ఏకైక కాంగ్రెసేతర నాయకుడు కూడా మోదీనే కావడం గమనార్హం. తద్వారా లోక్‌సభలో స్వయంగా మెజారిటీ సాధించిన ఏకైక కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. దానికి తోడు 1971లో ఇందిరా గాంధీ తర్వాత పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి సిట్టింగ్ ప్రధానమంత్రి కూడా మోదీ.
ఇక భారతదేశంలో నెహ్రూ కాకుండా ఒక రాజకీయ పార్టీకి నాయకుడిగా వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ఏకైక ప్రధానమంత్రి ప్రధాని మోదీ మాత్రమే. అదే విధంగా భారతదేశంలోని ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులందరిలో, పార్టీ నాయకుడిగా వరుసగా ఆరు ఎన్నికల్లో గెలిచిన ఏకైక నాయకుడు కూడా మోదీనే. గుజరాత్ నుంచి వరుసగా 2002, 2007, 2012లలో.. లోక్‌సభ ఎన్నికల్లో 2014, 2019, 2024 మోదీ గెలిచారు. దాంతో పాటూ వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీలను విజయపథంలో నడిపించడంలో ప్రధాని మోదీ.. నెహ్రూతో సమానంగా ఉన్నారు.
Also Read: Turkish Flight: ఫ్లైట్ లో ప్రయాణికుడు మృతి..మృతదేహం మాయం