/rtv/media/media_files/2025/07/25/turkish-2025-07-25-08-06-33.jpg)
Turkish Air Plane
ఈ నెల 13న తుర్కిష్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం TK79 టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరింది. విమానం బయలు దేరిన తర్వాత మధ్య మార్గంలో ఓ ప్యాసెంజర్ హెల్త్ పాడై మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న సిబ్బంది విమానాన్ని ఐస్లాండ్ లోని కెఫ్లావిక్ ఎయిర్ పోర్ట్ కు మళ్లించాలని అనుకున్నారు. కానీ అక్కడ పర్మిషన్స్ లభించకపోవడంతో షికాగోకు మళ్లించారు. అక్కడ ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ చేశారు. దాని తరువాత కుక్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయంలో మృతదేహాన్ని అప్పగించారు. వెంటనే మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వేరే విమానంలో ప్రయాణ ఏర్పాట్లను చేశారు.
మృతదేహం మాయం..
దీని తరువాతే అసలు చిక్కంతా వచ్చింది. విమాన సిబ్బంది మృతదేహాన్ని అప్పగించామని చెబుతోంది. కానీ తమకు ఎలాంటి బాడీ అందలేదని ఎగ్జామినర్ కార్యాలయ ప్రతినిధి నటాలియా డెరెవ్యానీ చెబుతున్నారు. దీంతో అసలు మృతదేహం ఏమైందనేది వింతగా మారింది. షికాగోలో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ తరువాత ఏమైందన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దాంతో పాటూ ప్రయాణికుడికి సంబంధించిన వివరాలు కూడా బయటకు రాలేదు. తుర్కిష్ విమానయాన సంస్థ వివరాలను వెల్లడించలేదు.
Also Read: Pak-China: వేస్ట్ ఫెలో.. పాక్ ఆర్మీ చీఫ్ ను బండ బూతులు తిట్టిన చైనా.. దోస్త్ కటీఫ్!?