/rtv/media/media_files/2025/07/25/china-pakistan-2025-07-25-07-46-04.jpg)
China-Pakistan
పాకిస్తాన్ అన్ని దేశాలకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తోంది. చైనాకు కూడా అదే చేసింది. తమ దేశంలో చైనా పౌరులకు భద్రత కల్పిస్తామని నమ్మబలికిన పాక్ వారిని గాలికి వదిలేసింది. దీనిపై చైనా తీవ్ర అసంతృప్తిగా ఉంది. ప్రస్తుతం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ చైనా పర్యటనలో ఉన్నారు. ఇందులో ఆయనను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి తీవ్ర పదజాలంతో విమర్శించారని తెలుస్తోంది. ఈ సంఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను హైలైట్ చేయడమే కాకుండా, చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే CPEC వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల భద్రత మరియు భవిష్యత్తుపై ప్రశ్నలను లేవనెత్తుతుంది.
పాకిస్తాన్ లో చైనా పౌరులపై దాడులు..
పాకిస్తాన్ లో ఉన్న చైనీయులపై ఎప్పటి నుంచో దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి ప్రాంతాలలో చైనా ఇంజనీర్లు, కార్మికులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇక గతంలో 2021లో, దాసు జలవిద్యుత్ ప్రాజెక్టుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిది మంది చైనా ఇంజనీర్లు మరణించారు. అలాగే 2023లో కరాచీలో ఒక కాన్వాయ్‌పై జరిగిన దాడిలో చైనా పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ పై చైనా కోపంగా ఉంది. వరుసగా చైనీయులపై దాడులు జరుగుతుండడంపై ఆ దేశాన్ని క్షమించేది లేదని తెలుస్తోంది. అందుకుగానూ పాక్ పై చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. అయితే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ చైనా కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని సమాచారం. ఇక మీదట చైనా ప్రాజెక్టులకు కానీ, ప్రజలకు కానీ ఎటువంటి ఆపదా కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడతామని ప్రామిస్ చేశారని చెబుతున్నారు.
Also Read: 4th Test: నాలుగో టెస్ట్ లో బజ్ బాల్ ఆటతో దుళ్ళగొడుతున్న ఇంగ్లాండ్