/rtv/media/media_files/2025/01/25/pUHNMbHkdWtqtHSomdCb.jpg)
CM Chandra babu Naidu
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ సంచలనం నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబును ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో దింపనుంది. ఫిబ్రవరి1న చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
Also Read: భారత జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులు.. తీవ్రంగా స్పందించిన విదేశాంగ శాఖ
మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేశాయి. ఈ క్రమంలోనే తమ పార్టీ అభ్యర్థుల మద్దతు కోసం బీజేపీ మిత్రపక్షాలను కూడా రంగంలోకి దింపనుంది. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ఢిల్లీలో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలోనే ఓటర్లున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపు పది లక్షల మంది ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడి ప్రభావం ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని బీజేపీ ఆయన్ని కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ప్రచారం ఢిల్లీలో వర్కవుట్ అవుతుందా ? లేదా ? అనేది తెలియాలంటే ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.
Also Read: కుంభమేళా కంటే లండన్ వెళ్లడమే చీప్.. ఆకాశాన్నంటుతున్న ఫ్లైట్ టికెట్ ధరలు!
ఇదిలాఉండగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈసారి ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా కేజ్రీవాల్ బిలియనీర్ల రుణమాఫీ అంశాన్ని లేవనెత్తడం చర్చనీయాంశమవుతోంది .
Also Read: దమ్ముంటే నల్గొండ క్లాక్ టవర్ దగ్గరకు రా.. కోమటిరెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్!
Also read: శాశ్వతంగా వారానికి నాలుగు రోజులే పని.. 200 కంపెనీలు సంచలన నిర్ణయం