UFO: అమెరికాలో యూఎఫ్‌వోలు !.. వీడియో వైరల్

అమెరికాలోని న్యూజెర్సీలో ఆకాశంలో పలు వస్తువులు గాల్లో ఎగరడం కలకలం రేపాయి. అవి యూఎఫ్‌వో(UFO) లాంటి డ్రోన్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
UFO Drone

అమెరికాలోని ఆకాశంలో పలు వస్తువులు గాల్లో ఎగరడం కలకలం రేపాయి. న్యూజెర్సీలోని పలు చోట్ల రాత్రిపూట అనుమానస్పదంగా ఈ వస్తువులు కనిపించాయి. అయితే అవి యూఎఫ్‌వో(UFO) లాంటి డ్రోన్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. న్యూజెర్సీలో తాజాగా ప్రకాశవంతమైన డ్రోన్లు గాల్లో ఎగరడం కనిపించాయి. అయితే అవి జనావాసాల మీదుగా వెళ్లడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: ఈవీఎంలపై విపక్షాల అనుమానాలు.. స్పందించిన షిండే !

అవి హెలికాఫ్టర్లని కొందరు అంటుడంగా.. మరికొందరేమో యూఎఫ్‌వో తరహా డ్రోన్లని చెబుతున్నారు.   గత నెలలో కూడా న్యూజెర్సీలో వివిధ ప్రాంతాల్లో కూడా ఇలాంటి వస్తువులు గాల్లో ఎగరడం కనిపించాయి. దాదాపు పది చోట్ల ఇలాంటి డ్రోన్లు ఎగరడాన్ని స్థానికులు గుర్తించారు. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్‌నకు చెందిన భవనాల దగ్గర్లో కూడా ఇలాంటి డ్రోన్లు కనిపించాయి. 

Also Read: ఢిల్లీలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్.. తర్వాత పూల వర్షం

ఈ డ్రోన్లు అలా తిరగడంపై ఫెడర్ ఏవియేషన్ అడ్మినస్ట్రేషన్ స్పందించింది. చివరికీ ఈ ప్రాంతంలో డ్రోన్లు తిరగకుండా నిషేధం విధించింది. మరోవైపు న్యూజెర్సీలో జరిగిన తాజా ఘటనపై గవర్నర్ ఫిల్‌ మర్ఫీ కూడా స్పందించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు వీటి నుంచి ఎలాంటి ముప్పు లేదని చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ కావడంతో ప్రజలు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. 
Also Read: ఈ సీజన్‌లో ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్లేస్‌లు మిస్ కావద్దు!

Also Read: సరిహద్దు భద్రత కోసం యాంటీ డ్రోన్ విభాగం : హోం మంత్రి అమిత్ షా

Advertisment