చేసేది కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం.. నెలకు జీతం రూ.13 వేలు.. కానీ ప్రియురాలికి ఖరీదైన ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చాడు. ముంబాయిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి తెలియకుండా రూ.21.6 కోట్లు కొట్టేశాడు. ఆ డబ్బుతో ఖరీదైన కార్లు, బైక్‌లు, ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఇది కూడా చూడండి: బెనిఫిట్ షోలు చిన్న పార్ట్.. సీఎం మాకు ఏం చెప్పారంటే.. దిల్ రాజు సంచలన ప్రెస్ మీట్! ఫేక్ మెయిల్ ఐడీతో.. వివరాల్లోకి వెళ్తే ముంబాయిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా హర్షల్ కుమార్ క్షీరసాగర్ పనిచేస్తున్నాడు. ఓ నకిలీ మెయిల్ ఐడీని క్రియేట్ చేసి జులై నుంచి ఇప్పటి వరకు రూ.21.6 కోట్లు నగదు వివిధ అకౌంట్లకు బదిలీ చేయించుకున్నాడు. బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేసి ఉన్న మెయిల్ అడ్రస్‌కు ఒకేలా ఉండే మెయిల్‌ను క్రియేట్ చేశాడు. కేవలం ఒక్క అక్షరం మాత్రమే మార్చాడు. ఆ తర్వాత మెయిల్ అడ్రస్‌లో పొరపాటు ఉందని.. అప్‌డేట్ చేయాలని కోరుతూ బ్యాంక్‌కు లేఖ రాశాడు. ఇది కూడా చూడండి: బన్నీపై నాకు కోపం లేదు.. మేం కలిసి తిరిగాం.. రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! దీంతో ఆ మెయిల్ ఐడీకి లావాదేవీలు అన్ని అయ్యేలా చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి డబ్బును కాజేశాడు. రూ.1.2 కోట్లతో బీఎండబ్ల్యూ కారు, రూ.1.3 కోట్లతో ఎస్‌యూవీ, రూ.32 లక్షలతో బీఎండబ్ల్యూ బైక్ కొని, తన ప్రియురాలికి ఛత్రపతి శంభాజీనగర్ ఎయిర్‌పోర్ట్ దగ్గరలో 4 బీహెచ్‌కే ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇంకా ఆమె కోసం వజ్రాల కళ్లజోడును కూడా ఆర్డర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు హర్షల్ కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చూడండి: Virat Kohli: కోహ్లీకి బిగ్ షాక్.. ఢీకొట్టినందుకు భారీ ఫైన్ ఇది కూడా చూడండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ నోట తగ్గేదే లే మాట.. సినీ పెద్దలతో ఏమన్నారంటే?