Kakani Govardhan Reddy: మాజీ మంత్రిపై కేసు నమోదు!
కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేత వంటేరు ప్రసన్న కుమార్ ఫిర్యాదు చేశారు. ఇటీవల కావలి ఆసుపత్రిలో పోలీసులు, టీడీపీ నేతలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.