Amit Shah: లోక్‌సభలో గందరగోళం.. అమిత్‌ షా పైకి పేపర్లు విసిరిన విపక్షాలు..

పార్లమెంటులో బుధవారం కేంద్రం మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

New Update
Amit Shah

Amit Shah

 పార్లమెంటులో బుధవారం కేంద్రం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. విపక్షాలు వీటిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశాయి. ఆ బిల్లుల ప్రతులను విపక్ష ఎంపీ చించి పారేశాయి. మరికొందరు అమిత్ షా(Amit Shah) పైకే కాగితాలు విసిరారు. దీంతో లోక్‌సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. స్పీకర్ సభను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. అయినప్పటికీ విపక్షాల ఆందోళనల నడుమే అమిత్ షా మూడు బిల్లులు ప్రవేశపెట్టారు.

 Also Read: హీటెక్కుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక.. NDAకి గట్టి పోటీ ఇవ్వనున్న ఇండియా కూటమి

కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు ఇవే 

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌ గేమింగ్ యాప్స్(Online Gaming Apps) విపరీతంగా పెరిగాయి. చాలమంది ముఖ్యంగా యువత ఈ గేమ్‌లకు బానిసై అప్పులపాలవుతున్నారు. వాటీని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు అరికట్టేందుకే కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా నిబంధనలు పాటించకుండా ఆన్‌లైన్ గేమ్స్‌ అందిస్తే వాళ్లకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. లేదా రూ.కోటి జరిమానా ఉంటుంది. లేదా ఈ రెండు కూడా విధించాలని ప్రతిపాదనలు చేశారు. 

జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2025

2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir) రాష్ట్ర హోదా కోల్పోయిన సంగతి తెలిసిందే. మోదీ సర్కార్‌.. జమ్మూకశ్మీర్‌, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఆ తర్వాత తమకు రాష్ట్ర హోదా కావాలని జమ్మూకశ్మీర్ ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కేంద్రం కూడా జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర హోదా కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టింది.  

కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ సవరణ బిల్లు 2025

ఈ బిల్లు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాల నిర్వహణకు సంబంధించిన చట్టాల్లో పలు మార్పులు తీసుకురానుంది.

రాజ్యాంగ 130వ సవరణ బిల్లు 2025

ఈ బిల్లు ప్రకారం ఏదైనా అవినీతి, అక్రమాలు, ఇతర క్రిమినల్ కేసుల ఆరోపణలతో 30 రోజుల పాటు జైల్లో ఉండే ప్రజాప్రతినిధులకు వాళ్ల పదవులు రద్దవుతాయి. అక్రమాలు, మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లే ప్రజాప్రతినిధులకు అధికార బాధ్యతలు తలగించేలా ఈ బిల్లును తీసుకొచ్చారు. ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రధానమంత్రి, ఎంపీలకు ఈ బిల్లు వర్తించనుంది. కనీసం అయిదేళ్ల పాటు శిక్ష పడే నేరం చేసి, అరెస్టయి, 30 రోజులు పాటు జైల్లో ఉంటే 31వ రోజున వాళ్ల పదవి పోతుంది. వారు రాజీనామా చేయకపోయినా కూడా కొత్త నిబంధనల ప్రకారం తమ పదవిని కోల్పోతారు.ఈ బిల్లుపైనే విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లును వాడుకుని కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు అవకాశం ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  

Also Read: టీచర్‌ను ప్రేమించిన స్టూడెంట్‌..ఒప్పుకోలేదని పెట్రోల్ పోసి..

Advertisment
తాజా కథనాలు