Student Love Teacher : టీచర్‌ను ప్రేమించిన స్టూడెంట్‌..ఒప్పుకోలేదని పెట్రోల్ పోసి..

ఈ మధ్య ప్రేమ అనే మాటకు అర్థం లేకుండా పోయింది. వయసుతో సంబంధం లేకుండా ప్రేమ పేరుతో చేస్తోన్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.  ప్రేమ పేరుతో ఒక విద్యార్థి స్కూల్‌లో పాఠం చెప్పే టీచర్ ను వేధించడమే కాకుండా ఆమె ఒప్పుకోలేదని పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.

New Update
Student Love Teacher

Student Love Teacher

Student Love Teacher: ఈ మధ్య ప్రేమ అనే మాటకు అర్థం లేకుండా పోయింది. వయసుతో సంబంధం లేకుండా ప్రేమ పేరుతో చేస్తోన్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.  ప్రేమ పేరుతో ఒక విద్యార్థి స్కూల్‌లో పాఠం చెప్పే టీచర్ ను వేధించడమే కాకుండా ఆమె ఒప్పుకోలేదని పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్టం నర్సింగ్‌పూర్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్కూల్‌లో చదువుతున్న 18 ఏళ్ల సూర్యాంశ్ కొచ్చార్ అనే విద్యార్థి ఆ స్కూల్‌లో విద్యాబోధన చేసే టీచర్‌ పట్ల ప్రేమ పెంచుకున్నాడు. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని ఆ టీచర్‌కు చెప్పాడు. ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు టీచర్‌  ఇదే విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యం సూర్యాంశ్ కొచ్చార్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. అతనిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా యాజమాన్యం టీసీ ఇచ్చి పంపించేసింది.ఇదిలా ఉండగా సూర్యాంశ్ కొచ్చార్‌ మరో స్కూల్‌ లో జాయిన్‌ అయ్యాడు. ఇది జరిగి రెండు సంవత్సరాలు అయింది.

Also Read: లోక్‌సభలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి.. రూల్స్ ఉల్లంఘిస్తే ఇక అంతే సంగతులు

అయితే ఆగస్టు 15. స్వాతంత్ర్య దినోత్సవం. ఈ సందర్భంగా సదరు స్కూల్ టీచర్ కొత్త చీర కట్టుకుంది. ఆమెను వెంబడించిన స్టూడెంట్‌ ఆమె చీరపై కొచార్ అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కొచార్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిచి తీవ్రంగా మందలించారు. దీంతో కొచార్ పగతో రగిలిపోయాడు. కోపంతో మండిపోయాడు. ఆవేశంతో  సోమవారం మధ్యాహ్నం కొచార్ పెట్రోల్ బాటిల్ తీసుకుని టీచర్ ఇంటికి వెళ్లాడు. ఆమె బయటకు రాగానే ఆమెతో ఎలాంటి సంభాషణ లేకుండానే మీద పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. దీంతో ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమెకు10 నుంచి-15 శాతం గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితురాలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తీవ్రగాయాలు ఉన్నప్పటికీ ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు.

ఇది కూడా చూడండి:తెలంగాణలో కొత్త మద్యం షాపులు.. లైసెన్స్‌లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

నిందితుడు  సూర్యాంశ్ ఆమె పట్ల ఏకపక్ష ప్రేమను పెంచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఆమెను ప్రేమిస్తున్నట్లు తెలపడమే కాకుండా నిందితుడు టీచర్ చీరపై అభ్యంతరకరమైన వ్యాఖ్య చేయడంతో వివాదం ముదిరిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కొత్వాలి పోలీసులు వేగంగా చర్య తీసుకున్నట్లు చెప్పారు. కొన్ని గంటల్లోనే డోంగర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్‌పూర్ గ్రామం వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడని.. దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న తర్వాత.. విద్యార్థి పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు.

Also Read: సీఎం రేఖా గుప్తాపై దాడి చేసింది కుక్కల ప్రేమికుడే.. పక్కా ప్లాన్‌తో దాడి చేశాడా?

Advertisment
తాజా కథనాలు