Actor Ravi Kishan: ‘రేసుగుర్రం నటుడిని చంపేస్తాం’.. గ్యాంగ్‌స్టర్ మాస్ వార్నింగ్..!

BJP ఎంపీ, సినీ నటుడు, బిహార్ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ రవి కిషన్‌కు ప్రాణహాని బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు మెసేజ్ ఆయన జ్యోతిష్కుడు ప్రవీణ్ శాస్త్రి మొబైల్‌కు వచ్చింది. ఈ మెసేజ్‌ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.

New Update
Actor Ravi Kishan death warning

Actor Ravi Kishan death warning

భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ, సినీ నటుడు, బిహార్ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ రవి కిషన్‌కు (Ravi Kishan) మరోసారి ప్రాణహాని బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు మెసేజ్ ఆయన జ్యోతిష్కుడు ప్రవీణ్ శాస్త్రి మొబైల్‌కు రావడంతో అంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఈ మెసేజ్‌ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

రామ్‌గఢ్ తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ విహార్ విస్టర్ కాలనీలో నివసించే జ్యోతిష్యుడు ప్రవీణ్ శాస్త్రి మాట్లాడుతూ.. నవంబర్ 4న తనకు 7904161800 నంబర్ నుండి కాల్ వచ్చిందని తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి.. ఈసారి మోదీ, యోగి ఇద్దరూ గెలవరు అని చెప్పాడు. ఆ కాల్ చేసిన వ్యక్తి తనను చంపుతానని, ఎంపీ రవి కిషన్‌ను కూడా చూసుకుంటానని బెదిరించాడని తెలిపాడు.

ఆ తర్వాత వాట్సాప్‌లో బెదిరింపు మెసేజ్ వచ్చిందని తెలిపాడు. అందులో రవి కిషన్, బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్ శుక్లా ఫోటోలపై క్రాస్ (X) గుర్తు పెట్టి ఉందని, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ మెసేజ్ పంపిన నంబర్‌పై లారెన్స్ బిష్ణోయ్ ఫోటో ప్రొఫైల్ పిక్చర్‌గా ఉందని తెలిపాడు. కాగా ప్రవీణ్ శాస్త్రి.. రవి కిషన్ ఇంట్లో పూజలు నిర్వహిస్తారు. గతంలో కూడా రవి కిషన్‌కు బెదిరింపులు వచ్చాయని, ఆ వ్యక్తిని గోరఖ్‌పూర్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారని ఆయన తెలిపారు.

బెదిరింపులు అందిన తరువాత రామ్‌గఢ్ తాల్ పోలీస్ స్టేషన్‌లో తాను ఫిర్యాదు చేశానని ప్రవీణ్ శాస్త్రి తెలిపారు. రవి కిషన్ నిరంతరం ప్రజల్లో ఉంటున్నందున, ప్రచారంలో చురుకుగా ఉన్నందున, ఎంపీ రవి కిషన్ భద్రతను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Advertisment
తాజా కథనాలు