/rtv/media/media_files/2025/11/07/musk-2025-11-07-10-30-53.jpg)
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ భవిష్యత్తులో మరింత ధనవంతుడిగా మారనున్నారు. టెస్లా వాటాదారులకు ప్రకటించిన ప్యాకేజీలతో అను ట్రిలియనీర్ గా మారనున్నాడు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన టెస్లా వార్షిక సర్వసభ్య సమావేశంలో నిన్న కంపెనీ వాటాదారులకు ప్యాకేజీలనుఅనౌన్స్ చేశారు. ఇందులో మస్క్ కు ఏడాదికి ఒక ట్రిలియన్ డబ్బులు అందనున్నాయి. కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో 75% కంటే ఎక్కువ షేర్లు పే ప్యాకేజీకి అనుకూలంగా ఓటు వేశాయని టెస్లా ప్రకటించింది. మస్క్ కంపెనీలో 15శాతం వాటాను కలిగి ఉన్నారు. అది ఇప్పుడు 25 శాతానికి పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అలా అయితే ఆయన వేతనం రోజుకు 237 మిలియన్ డాలర్లకు చేరుతుంది.
వన్ ట్రిలియన్ దిశగా మస్క్ సంపద..
టెస్లా వార్షిక సమావేశం మొత్తం నిన్న సందడిగా జరిగింది. టెస్లాకు సంబంధించి ఎలాన్ మస్క్ ఎలాంటి జీతం తీసుకోరు. కానీ ప్యాకేజీల ద్వారా డబ్బులను మాత్రం అందుకుంటారు. ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీలతో అతనికి రాబోయే 10 సంవత్సరాలలో 423.7 మిలియన్ల అదనపు టెస్లా షేర్లను ఇస్తుంది. ఈ క్రమంలో టెస్లా 8.5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ ను చేరుకుంటే..మస్క్ వాటా ఒక ట్రిలియన్ అవుతుంది. టెస్లాకు అవసరమైన $8.5 ట్రిలియన్ మార్కెట్ విలువను చేరుకోవాలంటే, షేర్లు ప్రస్తుతం ఉన్న స్టాక్ ధర నుండి 466% పెరగాలి. ఇది గత వారం రికార్డు స్థాయిలో $5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌ను తాకిన ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ Nvidia కంటే దాదాపు 70% ఎక్కువ.
టెస్లాలను రోబోతో అనుసంధానం..
భవిష్యత్తులో టెస్లా రోబోలతో కూడా అనుసంధానం కానుంది. దీనిని స్వయంగా ఎలాన్ మస్క్ తెలిపారు. ఈవీలను అమ్మడం నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రోబో టాక్సీలు, హ్యూమనాయిడ్ రోబోలపై టెస్లా దృష్టి సారిస్తుందని చెప్పారు. ఇందుకు నిదర్శనంగా నిన్నటి వార్షిక సమావేశంలో రోబో ఆప్టిమస్ కూడా పాల్గొంది. భవిష్యత్తులో ఈ రోబో టెస్లా తయారీ, డెలవరీలు, వ్యక్తిగత సహాయాన్ని కూడా నిర్వహిస్తుందని మస్క్ చెప్పారు. టెస్లాకార్లలోనే కాదు, రోబోటిక్స్, AI లలో కూడా కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. ఈ సందర్భంగా రోబో ఆప్టిమస్ తో కలిసి ఆయన డాన్స్ చేశారు.
Tesla’s Optimus robots outperformed their fellow robot, Elon in dancing 😂pic.twitter.com/hLBnvZSPuL
— SMX 🇺🇸 (@iam_smx) November 6, 2025
Follow Us