/rtv/media/media_files/2025/08/15/modi-s-diwali-gift-gst-reduction-2025-08-15-14-53-14.jpg)
Modi's Diwali gift.. GST reduction
79వ స్వాతంత్ర దినోత్సవం(79th Independence Day) సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) దేశంలోని సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. పేద ప్రజల పాలిట గుదిబండగా మారిన గూడ్స్ అండ్ సర్వీ్స్ ట్యాక్స్ (GST) తగ్గింపుపై ఆయన కీలక ప్రకటన చేశారు. నిత్యవసర ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగిస్తామని ప్రధాని మోదీ కీలక ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట(Red Fort) పై ప్రధాని శుక్రవారం (ఆగస్ట్ 15) జాతీయ జెండా ఎగరేశారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ దీపావళి నాటికి జీఎస్టీ భారాన్ని భారీగా తగ్గిస్తామని.. ఇందుకు జీఎస్టీలో సంస్కరణలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.దీపావళి నాటికి రేట్లు తగ్గించి పండగ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా ప్రధానమత్రి ప్రకటించిన వెంటనే జాతీయ అర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ కి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న 5, 12, 18, 28 శాతం జీఎస్టీ శ్లాబులను రద్దు చేస్తామని, కేవలం రెండు శ్లాబులను మాత్రమే కొనసాగిస్తామని ప్రకటించింది.
Also Read : ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌లు వచ్చేశాయి.. ఒక్కసారి చెల్లిస్తే ఏడాదంతా తిరగొచ్చు
Modi's Diwali Gift - GST Reduction
ఇదిలా ఉండగా గడిచిన ఎనిమిదేళ్లలో జీఎస్టీ విషయంలో తమ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు.అందులో భాగంగా సామాన్యులు చెల్లించే పన్నుల్లో భారీగా కోత పెట్టబోతున్నామని, దీనివల్ల వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయని మోడీ ప్రకటించారు. తద్వారా దేశ ప్రజలకు ఈ సారి డబుల్ దీపావళి బొనాంజా అందించబోతున్నామన్న గుడ్ న్యూస్ చెప్పారు. జీఎస్టీలో సవరణ కోసం ఇప్పటికే హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి రివ్యూ నిర్వహిస్తున్నామని.. కమిటీ రిపోర్టు ఆధారంగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాని స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్రాలతో చర్చించి తదుపరి దశ సంస్కరణలు చేపట్టనున్నట్లు మోడీ చెప్పారు. దీనివల్ల సామాన్య ప్రజలకు పన్ను భారం తగ్గనుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుక బడిన పౌరులకు ఉపశమనం కలుగుతుందని చెప్పారు.
జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి అవసరమైన మార్పులు చేర్పులు చేసేందుకు యత్నిస్తున్నామన్నారు. జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలు ఈ దీపావళి(Diwali) లోపు ప్రవేశ పెడుతామని ప్రధాని చెప్పారు. దేశంలోని సామాన్య ప్రజల ప్రజలపై భారాన్ని తగ్గించేలా ఈ దీపావళి కానుక ఉంటుందని తెలిపారు. జీఎస్టీ తగ్గుదల వల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా ప్రయోజనం పొందుతాయని మోదీ పేర్కొన్నారు. నిత్యం వినియోగించే వస్తువుల ధరలు తగ్గడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్ఠమవుతుందని ప్రధాని తెలిపారు. అయితే ఇది ఏ విధంగా అమలు చేస్తారని మోదీ వెల్లడించనప్పటికీ ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం జీఎస్టీ లో మాత్ర మార్పు రానున్నట్లు తెలుస్తోంది.
దీన్ని బట్టి ‘ఆత్మనిర్భర్ భారత్’ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో మరిన్ని సంస్కరణలను తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిర్మాణాత్మక సంస్కరణలు, పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, జీవన వ్యయాలు తగ్గింపు వంటి మూడు అంశాలపై ఈ బ్లూప్రింట్ రూపొందించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. సాధారణ ప్రజలు వాడే వస్తువుల ధరలు తగ్గించే ఉద్దేశంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మంత్రులతో కూడిన ఒక బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిందని ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో గతంలో లాగా నాలుగు కాకుండా స్టాండర్డ్, మెరిట్ అనే రెండు రేట్లు మాత్రమే ఉంటాయని పేర్కొంది. మూడు పిల్లర్లకు సంబంధించి ప్రతిపాదనలను మంత్రుల బృందానికి చర్చల కోసం పంపామని, రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించి ఏకాభిప్రాయం సాధిస్తామని తెలిపింది. ప్రధాని ప్రకటించినట్లు జీఎస్టీ రెట్లలో మార్పులు వస్తే నిత్యవసర ధరలు అందుబాటులోకి వచ్చి సామన్య ప్రజలు లబ్ధి పొందే అవకాశం ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.
ఇది కూడా చూడండి: IAF రియల్ హీరో.. పాకిస్థాన్ జైలు నుంచి 2సార్లు తప్పించుకున్న వింగ్ కమాండర్ కథ!