PM KISAN: రైతులకు మోదీ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్.. ఇక 10 వేలు!

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.6 వేలు ఇస్తుండగా.. దీన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు మోదీ తెలిపారు. ఆర్థికంగా రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
MODI

న్యూ ఇయర్ సందర్భంగా ప్రధాని మోదీ రైతులకు కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సాయంగా మోదీ రూ.6 వేలు ఇస్తున్నారు. మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఇకపై ఈ పెట్టుబడి సాయాన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు మోదీ వెల్లడించారు. ఆర్థికంగా రైతులను ఆదుకునేందుకు వారికి రూ.10 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్‌..ఎంత వింతగా ఉందో చూడండి!

ఈ ఏడాది బడ్జెట్‌లో..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది విడుదల చేసే 2025-2026 బడ్జెట్‌లో దీని గురించి ప్రకటించనున్నారు. ఆరేళ్ల క్రితం ప్రారంభించిన కిసాన్ నిధి పథకం ద్వారా ఎందరో రైతులకు సాయం చేయడం వల్ల వారికి బాగా ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 18 వాయిదాలు చెల్లించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 19వ వాయిదాలను జమ చేయనుంది. ఈ క్రమంలో మోదీ పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.

ఇది కూడా చూడండి: Kadapa: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

ఇదిలా ఉండగా ఈ కిసాన్ నిధి పథకానికి అప్లై చేసుకోవాలంటే రైతులు కొన్ని రూల్స్ పాటించాలి. రాష్ట్ర ప్రభుత్వంతో గుర్తింపుతో 2 హెక్టార్ల కంటే తక్కువ మాత్రమే సాగు భూమి ఉండాలి. అంత కంటే ఎక్కువగా ఉంటే ఈ పథకానికి అనర్హులు. బ్యాంకు ఖాతాకు కేవైసీ లింక్ చేసుకోవాలి. ఆ తర్వాత pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి న్యూ రైతు నమోదుపై క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేయాలి. ఇలా చేశాక రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో OTPతో ద్వారా ఆథంటికేట్ చేస్తే అయినట్లే.

ఇది కూడా చూడండి: Horoscope 2025: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశుల లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు