భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటులు కల్పించింది. వీసా లేకున్నా కూడా ఆ దేశంలో 60 రోజుల పాటు ఉండేలా పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటకం, చిన్నపాటి వ్యాపారాల కోసం థాయ్‌లాండ్‌కు వచ్చే బారతీయలకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని తెలిపింది. 2025 జనవరి 1వ తేదీ నుంచి భారత్‌లో ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) ఈ-వీసా విధానం అమల్లోకి తీసుకొస్తామని చెప్పింది. Also Read: తల దించుకోవాల్సి వస్తోంది.. పార్లమెంటులో నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు Thailand Announces E-Visa For Indian Passport Holders థాయిలాండ్‌యేతర జాతీయులు https://www.thaievisa.go.th/ వెబ్‌సైటలోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని థాయ్‌లాండ్ ఎంబసీ బుధవారం తెలిపింది. ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని ఢిల్లీలో ఉన్న థాయ్‌లాండ్ రాయబార కార్యాలయం తెలిపింది. ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే వీసా దరఖాస్తు ఫీజు తిరిగి ఇవ్వడం ఉండదని చెప్పింది. వీసా ఫీజు కట్టిన 14 రోజుల్లోనే ఈ-వీసా దరఖాస్తు పరిశీలన ప్రక్రియ పూర్తవుతుంది. సాధారణ వీసా కోసం డిసెంబర్ 16 లోపు అప్లై చేసుకోవాలి. ఇక దౌత్య, అధికారిక వీసా కోసం డిసెంబర్ 24 లోపు దరఖాస్తు చేసుకోవాలి. Also Read: కేంద్రం స్పందించేవరకూ ఆగండి..ప్రార్థనా స్థలాల కేసులో సుప్రీంకోర్టు అయితే ఈటీఏలో మాత్రం కొన్ని ప్రయోజనాలున్నాయి. ఈ-వీసా తీసుకుంటే థాయ్‌లాండ్‌లో గరిష్టంగా 60 రోజుల పాటు అక్కడ ఉండొచ్చు. అత్యవసర సందర్భాల్లో మరో 30 రోజులు కూడా అక్కడ ఉండొచ్చు. అంతేకాదు ఈటీఏ పర్మిషన్ పొందిన ప్రయాణికులు చెక్‌పాయింట్ల వద్ద ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీ కూడా తొందరగానే పూర్తవుతుంది. ఈటీఏపై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే పూర్తి వివరాలు అధికారులకు అక్కడే కనిపిస్తాయి. మరో విషయం ఏంటంటే ఇలా వీసా మినహాయింపు పొందిన విదేశీయులు థాయ్‌లాండ్‌లో ఎన్నాళ్ల నుంచి సంక్రమంగా, అక్రమంగా ఉంటున్నారనే వివరాలన్నీ కూడా అక్కడి ప్రభుత్వానికి అందుతాయి. ఒకవేళ గడువు దాటాకా కూడా ఎవరైనా అక్కడ ఉంటే రోజుల లెక్కన జరిమానా విధిస్తారు. Also Read: ఈ పార్లమెంటు సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు Also Read : భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. హోంమంత్రి కీలక సూచనలు