/rtv/media/media_files/2025/05/18/nTyjLljztrM2MHwZw5VJ.jpg)
Earthquake
ఇటీవల తెలుగు రాష్ట్రాలలో స్వల్ప భూ ప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. గతంలో తెలంగాణలోని ములుగు ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి వంటి ప్రాంతాలలో కూడా కనిపించింది.
Assam Earthquake
ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. జపాన్ దేశం నోటో ద్వీపకల్పంలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. అలాగే, ఆఫ్ఘనిస్తాన్ కూడా గతంలో వరుస భూకంపాల ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం, ఇళ్లు ధ్వంసం కావడం వంటి విషాదాలను చూసింది. తాజాగా భారత్ లో కూడా స్వల్వ భూకంపం సంభవించింది.
Earthquake of 2.7 magnitude hits Assam's Cachar
— ANI Digital (@ani_digital) October 18, 2025
Read @ANI Story | https://t.co/JNYxAwRIKo#Earthquake#Assam#Cacharpic.twitter.com/ituQUU58Lg
అస్సాంలోని కచార్ జిల్లాలో ఈరోజు ఉదయం రిక్టర్ స్కేలుపై 2.7 తీవ్రతతో స్వల్ప భూకంపం(assam-earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఈ భూకంపం శనివారం ఉదయం సంభవించింది. కచార్ జిల్లాలో భూమి కంపించడంతో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. ఈ భూకంప కేంద్రం, లోతుపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే ఈ స్వల్ప ప్రకంపనల కారణంగా కచార్ జిల్లా పరిధిలో ఎక్కడా కూడా ఎలాంటి ప్రాణ నష్టం గానీ లేదా ఆస్తి నష్టం గానీ సంభవించినట్లు సమాచారం లేదు. సాధారణంగా ఈశాన్య రాష్ట్రాలు భూకంపాలు సంభవించే జోన్‌లలో ఉండటం వలన తరుచుగా చిన్నపాటి భూ ప్రకంపనలు నమోదవుతుంటాయి.
సాధారణంగా భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం అధిక భూకంపాల ప్రభావిత ప్రాంతం పరిధిలోకి వస్తుంది. అందుకే అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతం హిమాలయ పర్వత శ్రేణులకు దగ్గరగా ఉండటం, భూమిలోని టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల భూకంపాలు సర్వసాధారణం. కొన్ని రోజుల క్రితం కూడా ఈశాన్యంలో 5.8, 3.5 తీవ్రతతో కూడిన భూకంపాలు నమోదయ్యాయి. కానీ ఇవాళ 2.7 తీవ్రతతో ప్రకంపన చాలా స్వల్పమైనది కావడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయాందోళనలకు గురికావొద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే ఎలాంటి ప్రమాదాలు లేనప్పటికీ, ప్రజలు ఇలాంటి సమయంలో భూకంపాల నుండి రక్షణ కోసం కొన్ని సూచనలు పాటించాలని అధికారులు తెలిపారు. భూమి కంపించినప్పుడు వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు (భవనాల నుండి దూరంగా ఉన్న బహిరంగ ప్రదేశాలు) వెళ్లడం, లేదా పటిష్టమైన వస్తువుల కింద ఆశ్రయం పొందడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.