మధ్యప్రదేశ్‌లో వందల ఏళ్ల నాటి పురాతన రామాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ ఆలయం మొత్తం కాలిపోయింది. దేవుడి విగ్రహాలు కాలిపోయాయి. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న గ్రామస్థులు, ఫైర్ సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఖాండ్వా జిల్లాలోని భామ్‌గఢ్ గ్రామంలో 500 ఏళ్ల క్రితం రాజులు రామాలయాన్ని నిర్మించారు. అప్పటినుంచి అక్కడికి భక్తులు దర్శనం కోసం వస్తూనేఉన్నారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో గుడిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
Also Read: అన్నా వర్సిటీ బాధితురాలికి భారీ పరిహారం.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు
ఇది గమనించిన స్థానికులు పూజారిని నిద్రలేపి ఈ విషయం చెప్పారు. ఆ తర్వాత ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఆ గుడి చెక్కతో నిర్మించడం వల్ల మంటలు వేగంగా, పెద్దఎత్తున వ్యాపించాయి. వాటిని ఆపేదేందుకు స్థానికులు యత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి మూడు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కాని అప్పటికే ఆలయం పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్న దేవుని విగ్రహాలు కూడా కాలిపోయి దెబ్బతిన్నాయి.
Also Read: పాకిస్థాన్‌పై తాలిబన్ల ప్రతీకార దాడులు.. 19 మంది మృతి
ఆలయంలో ఉన్న దీపం వల్లే మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆలయం వెనుక చెత్త కుప్పల నుంచి మంటలు చెలరేగినట్లు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్కడ చెత్తపోయడంపై కూడా గతకొంతకాలంగా వివాదం ఉందని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలసులు కేసు నమోదు చేశారు. అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: దారుణం.. మాజీ మంత్రి కాకాణి అనుచరుడి భాగోతం.. మహిళపై లైంగిక దాడి!
Also Read: స్పోర్ట్స్ షూ వేసుకొచ్చిందని జాబ్ నుంచి తొలగింపు.. కంపెనీకి బిగ్ షాక్