Afghanistan: పాకిస్థాన్‌పై తాలిబన్ల ప్రతీకార దాడులు.. 19 మంది మృతి

ఇటీవల పాకిస్థాన్‌.. అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా అఫ్గానిస్థాన్‌.. పాకిస్థాన్‌పై దాడులకు పాల్పడింది. పాకిస్థాన్‌లోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడింది. ఈ దాడికి పాకిస్థాన్ ఇంకా స్పందించలేదు.

New Update
pakisthan

pakisthan

ఇటీవల పాకిస్థాన్‌.. అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 46 మంది మృతిచెందారు. మరికొందరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. అయితే దీనికి ప్రతీకారంగా అఫ్గానిస్థాన్‌.. పాకిస్థాన్‌పై దాడులకు పాల్పడింది. పాకిస్థాన్‌లోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడింది. ఈ మేరకు అఫ్గానిస్థాన్ రక్షణ మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది. అయితే ఈ దాడులు ఎలా చేశారు.. ఎంతమంది మరణించారనే విషయాలను వెల్లడించలేదు. 

Also Read: ఇండిగో విమానం 16గంటలు లేట్..ఎయిర్పోర్ట్‌లో ప్రయాణికులు పాట్లు

అయితే ఈ దాడుల్లో దాదాపు 19 మంది పాకిస్థాన్ సైనికులు మృతి చెందారని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. మరోవైపు తాలిబన్లు చేసిన ఈ దాడులపై ఇప్పటిదాకా పాకిస్థాన్ స్పందించలేదు. ఇటీవల తమ దేశంలో తాలిబన్లు పలు ఉగ్రదాడులకు పాల్పడ్డాయని పాకిస్థాన్ ఆరోపణలు చేస్తోంది. కానీ పాక్ చేస్తున్న ఈ ఆరోపణలను తాలిబన్ ఖండిస్తోంది. ఈ ఏడాది మార్చిలో అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ దాడులు చేసింది. ఆ తర్వాత ఇటీవలే మరోసారి కూడా దాడులు చేసింది. 

Also Read: స్పోర్ట్స్‌ షూ వేసుకొచ్చిందని జాబ్ నుంచి తొలగింపు.. కంపెనీకి బిగ్ షాక్

దీంతో తాము కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్లు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా పాక్‌పై దాడులకు పాల్పడ్డారు. ఇదిలాఉండగా 2021లో అఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ దాడులు రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు తాలిబన్లు చేసిన దాడితో మళ్లీ పాకిస్థాన్ ఆఫ్గాన్‌పై దాడులు చేస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇది ఇలానే కొనసాగితే ఇరుదేశాల మధ్య భీకర యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కూడా రావొచ్చని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 

Also Read: ఢిల్లీని ముంచెత్తిన వానలు..ఎల్లో అలెర్ట్..100 ఏళ్ళల్లో ఇదే మొదటసారి

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు