/rtv/media/media_files/2025/12/08/fotojet-2025-12-08t093921800-2025-12-08-09-40-09.jpg)
BL Santosh's Warning : బీజేపీ హైకమాండ్ నేత బీఎల్ సంతోష్(bl-santhosh) వార్నింగ్ తో తెలంగాణ బీజేపీ నాయకులు దారికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్ శివార్లలో జరిగిన పార్టీ వర్క్‌షాప్‌లో ఉంటే ఉండండి పోతే పోండని పార్టీలో పలువురు నేతలకు బీఎల్ సంతోష్ వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈ వార్నింగ్‌తోనే వివాదాస్పద కామెంట్స్ చేస్తున్న కమలం నాయకుల్లో కంగారు మొదలైంది. ఈ క్లాస్ ఎఫెక్ట్‌తోనే నేతలు ఒక్కొక్కరుగా దారికొస్తున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాంచందర్‌రావుపై సెటైర్లు వేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(bjp mp dharmapuri arvind) తాజాగా దిగొచ్చారు. రాంచందర్‌రావుతో తనకు ఎలాంటి విబేధాలు లేవని ఆదివారం మీడియా ముందు క్లారిటీ ఇచ్చారు.. ప్రకటిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రామచందర్ రావుతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని, ఆయన తనకు పెద్దన్నలాంటి వారని అన్నారు. రాంచందర్‌రావు నేతృత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని, తెలంగాణలో అధికారంలోకి కూడా వస్తామని చెప్పారు.
రామచందర్ రావు తనకు పెద్దన్నలాంటివాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. ఆయన నేతృత్వం లో పార్టీ బలపడుతోందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రామచందర్ రావు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు చేయవద్దని తాను గతంలో కోరిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో ప్రచారానికి సంబంధించి అప్పట్లో అరవింద్ చేసిన వ్యాఖ్యలు కమలం పార్టీలో చర్చకు కారణ మయ్యా యి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గల్లీలకు వచ్చే ప్రచారం చేయాలా అని ప్రశ్నించారు. అక్కడ తిరుగుతున్న వాళ్లకంటే తన మాటలు, విమర్శలు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్‌కు వచ్చి ప్రచారం చేస్తేనే చేసినట్లు కాదు.. ఎక్కడి నుంచి చేసినా చేసినట్లే అని అన్నారు. అనవసరంగా ప్రచారానికి రాలేదని తనపై ఫిర్యాదులు చేయవద్దని రాంచందర్‌రావును కోరుతున్నా అని అర్వింద్ అప్పట్లో కామెంట్ చేశారు.
Also Read : ఎక్స్‌లో కేసీఆర్‌పై కేటీఆర్ ఇంట్రస్టింగ్ పోస్ట్..
క్లాస్ పీకిన బీఎల్ సంతోష్
ఇటీవల తెలంగాణ బీజేపీ వర్క్ షాప్ లో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కీలక నేతలతో ఆయన మాట్లాడారు. పార్టీలో నాయకుల మధ్య గ్యాప్ గురించి ప్రస్తావించారు. పార్టీ అధ్యక్షుడిని లైట్ తీసుకోవద్దని ఆయన సూచించారు. ప్రతి అంశం తమకు తెలుసని అన్నారు. లంచ్, బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లంటూ గ్రూపులుగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవద్దని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహారిస్తామని ఉపేక్షించబోమని తేల్చేశారు. ఉంటే ఉండండి పోతే పోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల పార్టీలో వివాదాస్పద కామెంట్స్ చేస్తున్న ఎంపీలు ఈటల రాజేందర్, అరవింద్ ను ఉద్దేశించే బీఎల్ సంతోష్ ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బీఎల్ సంతోష్ వార్నింగ్ ఇచ్చిన మూడు రోజులకే అరవింద్ రాంచందర్‌రావు చెప్పినట్టే నడుచుకుంటానని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పడం చర్చనీయాంశమైంది. అయితే మరో ఎంపీ ఈటల ఎప్పుడు దారికొస్తారనే చర్చ కూడా పార్టీ నేతల్లో జరుగుతుండడం గమనార్హం.
Also Read : ఇద్దరు భార్యల నామినేషన్.. ఏ భార్య సర్పంచ్ అంటే?
Follow Us