Vijaysai: మాజీ సీఎం జగన్‌కు బిగ్‌షాక్‌.. బీజేపీలోకి విజయసాయి?

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నరేళ్లు పూర్తవుతున్న తరుణంలో పొలిటికల్ ఈక్వేషన్లు రోజురోజుకు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీని వీడిన ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతున్నారట.

New Update
FotoJet - 2025-12-08T112224.418

Big shock for former CM Jagan... Vijayasai joins BJP?

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నరేళ్లు పూర్తవుతున్న తరుణంలో పొలిటికల్ ఈక్వేషన్లు రోజురోజుకు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీని వీడిన ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy) ఏకంగా తన రాజ్యసభ ఎంపీ పదవికే రాజీనామా చేశారు. తాను కేవలం వైసీపీని వీడడం లేదని, పాలిటిక్స్‌ నుంచే వెళ్లిపోతున్నానని గుడ్‌బై చెప్పారు. అయితే తాజాగా విజయసాయి తన మనసు మార్చుకుంటు న్నారు. ఇటీవలే ఆయన అవసరమైతే తాను రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని స్టేట్‌మెంట్‌ ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఇదే స్పీడులో ఆదివారం ఆయన మరో అడుగు ముందుకేసి ఓ ట్వీట్‌ చేశారు. హిందువులపై కుట్రను సహించేంది లేదని ట్వీట్‌లో పేర్కొన్నారు. మతమార్పిడులను ఆపాలని, అదే భారతదేశానికి శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. విజయసాయి చేసిన ట్వీట్‌ రాష్ట్రంలోని పొలిటికల్‌ వర్గాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. 

Also Read :  మంత్రి లోకేష్ అమెరికా-కెనడా టూర్.. పెట్టుబడుల కోసం కీలక సమావేశాలు!

Vijaysai Joins BJP

డబ్బు ఆశ చూపి.. మతం మార్చాలని ప్రయత్నిస్తే మాత్రం అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి.. గుణపాఠం నేర్పిద్దామని పిలుపునిచ్చారు. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి విచారణ జరపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. సాయిరెడ్డి తాజాగా హిందూ మతంపై కుట్రలు చేస్తే సహించేది లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చకు తెర తీసింది. ఆయన ఎప్పటినుంచో సన్నిహితంగా ఉంటూ వస్తున్న బీజేపీలో  చేరే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న విశ్లేషణ వినిపిస్తోంది. సాయిరెడ్డి భవిష్యత్ అడుగులపై  త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ(ysrcp)లో కీలకంగా పని చేసిన సాయిరెడ్డి 2024 ఎన్నికల తరువాత పార్టీని వీడారు. జగన్ కోటరీ కారణంగానే తాను పార్టీ వీడుతున్నట్లు స్పష్టం చేసారు. ఆ తరువాత కాకినాడ పోర్టు, లిక్కర్ కేసుల్లో సాయిరెడ్డి వెల్లడించిన అంశాలు సంచలనంగా మారాయి. కాగా ఇటీవల సాయిరెడ్డి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరోసారి జగన్(jagan mohan reddy news) కోటరీ గురించి తన వాదన వినిపించారు. పవన్ తో ఉన్న స్నేహం గురించి ప్రస్తావన చేసారు. కాగా, విజయసాయిరెడ్డి ఫస్ట్‌ నుంచి ఎంపీగా ఉండడంతో ఆయనకు జాతీయస్థాయిలో ఉన్న బీజేపీ(bjp) నేతలతో మంచి సంబంధాలున్నాయని, ఈ సంబంధాలతో త్వరలో ఆయన కాషాయకండువా కప్పుకునే ఛాన్స్‌ ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. గతంలో జనసేన చీఫ్‌, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం తన ప్రాణాల్ని కూడా అర్పిస్తానన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలో విజయసాయిరెడ్డి పవన్ పార్టీలో చేరతారా? లేక బీజేపీలోనే జాయిన్‌ అవుతారా అని సోషల్‌ మీడియాలో పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పవన్‌ నాకు స్నేహితుడని విజయసాయిరెడ్డి పదేపదే చెబుతుండడం, దీనికి తోడు హిందూమతంపై సాయిరెడ్డి కూడా పవన్‌ తరహాలో ఘాటుగా స్పందించడం కూడా ఆయన బీజేపీలో లేదా జనసేనలో చేరతారనే ప్రచారానికి కారణమవుతోందని పలువురు పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 

Also Read :  ఏపీలో స్క్రబ్‌ టైఫస్ డేంజర్‌ బెల్స్‌.. వింత వ్యాధితో ప్రజల్లో టెన్షన్‌..టెన్షన్‌

Advertisment
తాజా కథనాలు